TG Electronic Vehicle policy: మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఏడాదికి అక్షరాలా లక్ష రూపాయలు ఆదా చేయవచ్చు. అంతేకాదు కాలుష్య రహిత సమాజం కోసం మీవంతు సహకరించిన వారవుతారు. మరెందుకు ఆలస్యం పాటించండి.. మీ డబ్బు ఆదా చేసుకోండి అంటున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.
నేటి సమాజంలో వాహనం లేని ఇల్లు ఉంటుందా.. అస్సలు కనిపించవు కూడా మనకు. ప్రతి ఒకటికి మించి రెండు, మూడు వాహనాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇలా వాహనాల రద్దీ పెరగడంతో, భవిష్యత్ తరాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో కాలుష్యం ధాటికి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ, ఇన్ని కావు.
దేశ రాజధాని ఢిల్లీలో పొగ కాలుష్యం అధికమై, రహదారులు కూడా కనిపించని పరిస్థితి. అంతేకాదు ఎన్నో జలాశయాలు కూడా కాలుష్యం బారిన పడి, జల కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. కాలుష్య రహిత సమాజం కోసం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు సైతం సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ఢిల్లీలో వచ్చిన కాలుష్య సమస్యలు హైదరాబాద్ నగరంలో తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్, బైక్స్, ట్యాక్సీ, టూరిస్ట్ క్యాబ్స్, ఆటోలు, గూడ్స్ వెహికల్స్, ఎలక్ట్రికల్ ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్ బస్సులు వినియోగించాల్సిన అవసరం ఉందని, ఈ వాహనాలకు నూతన పాలసీ అమలుకై జీవో 41 ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రేపటినుండి ఈ పాలసీ అమలులోకి వస్తుందని, డిసెంబర్ 31, 2026 వరకు తుది గడువుగా మంత్రి పొన్నం ప్రకటించారు.
Also Read: మధిరలో ప్రత్యక్షమైన లేడీ అఘోరీ.. అక్కడ ఎవరిని కలిశారో తెలిస్తే.. షాక్ కావాల్సిందే!
ఈ ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఎటువంటి ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవని వాహన దారులకు శుభవార్త సైతం చెప్పారు మంత్రి. అలాగే ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్ లకు ప్రత్యేక అనుమతులు కూడా అవసరం లేదని, తయారీదారులే చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంతో ఏడాదికి వాహనదారులకు సుమారు లక్షకు పైగా డబ్బు ఆదాయం అవుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచాలని కోరారు. మరెందుకు ఆలస్యం మీరు ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించండి.. డబ్బు ఆదా చేసుకోండి మరి.