Big Stories

Poonam Kaur: అయ్యో పాపం.. ఆ వ్యాధితో బాధపడుతోన్న పూనం.. బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి..?

Share this post with your friends

Poonam Kaur

Poonam Kaur : పూనమ్ కౌర్.. ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాలు చేసింది తక్కువే అయినా.. తన కళ్లతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. గతేడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొని వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పలు సమస్యలపై స్పందిస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా, చెల్లెలి క్యారెక్టర్స్ లో నటించిన పూనమ్ కౌర్.. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అందుకు కారణం తనకొక వ్యాధి రావడమేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని పూనమ్ కౌర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రముఖ నేచురోపతి వైద్యులైన డా. మంతెన సత్యనారాయణతో కలిసి ఒక ప్రోగ్రాం కోసం ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తనకు వచ్చిన వ్యాధి గురించి చెప్పింది పూనమ్ కౌర్. తనకి ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి వచ్చిందని, బట్టలు వేసుకోవడానికి కూడా వీలుండేది కాదని పేర్కొంది. తీవ్రమైన బాడీ పెయిన్స్ వచ్చాయని తెలిపింది. వ్యాధికి చికిత్స కోసం మంతెనగారి వద్దకు వచ్చానని వెల్లడించింది. ఈ వ్యాధి వచ్చినపుడు శరీరంలో కదలికలు అంత ఈజీగా ఉండవని, చాలా లూజ్ దుస్తులు వేసుకోవాలని చెప్పుకొచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు తాను ఫైబ్రోమైయాల్జియా వ్యాధితో బాధపడ్డానని, వ్యాధిని తగ్గించేందుకు మంతెన ఇచ్చిన సూచనలు అమూల్యమైనవని ఆమె అభిప్రాయపడింది.

ఫైబ్రోమైయాల్జియా అంటే ఏంటి..?

తరచుగా శారీరక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడిని కలిగించే సంఘటనలకు గురవ్వడం వల్ల ఫైబ్రోమైయాల్జియా రావొచ్చు. ఫైబ్రోమైయాల్జియా అంటే.. శరీరంలోని కండరాలు పట్టేయడం. వాటిని ఏ కొంచెం కదిలించినా నొప్పులు వస్తాయి. ఫలితంగా బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలసట పెరుగుతుంది.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్పష్టత ఫైబ్రో ఫాగ్ ని చూపుతాయి. ఈ వ్యాధికి గురైన వ్యక్తులు.. మానసిక శ్రమ అవసరమయ్యే పనులను చేయడం సవాలుగా భావిస్తారు. అలాగే స్పర్శ, పీడనం, ఉష్ణోగ్రత మార్పులు, శబ్దం, లైట్లు ఉన్న ప్రదేశాల్లో చాలా సున్నితంగా ఉంటారు. అలోడిియా అని పిలువబడే.. అధిక సున్నితత్వం, నొప్పి అవగాహనను పెంచుతుంది. రోజువారి దినచర్యలోనూ అసౌకర్యానికి గురవుతారు.

దీనికి చికిత్స అందరూ వైద్యులు చేయలేరు. అలాగని కేవలం చికిత్సతో మాత్రమే వ్యాధి తగ్గదు. చికిత్సలో మందులతో పాటు.. వ్యాయామం, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి చేయాలి. ఫిజికల్ థెరపీ, హీట్ లేదా కోల్డ్ థెరపీ, ఆక్యుపంక్చర్, మసాజ్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలూ ఉన్నాయి. ధ్యానం, యోగా, తాయ్ చి వంటి వాటిని కూడా పాటించాలి. ఇవి ఒత్తిడిని తగ్గించి.. విశ్రాంతినిస్తాయి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News