E-Paper
Advertisement

Why Biscuits Have Holes: బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు ఉన్నాయి..? కారణం తెలిస్తే షాకవుతారు!

Why Biscuits Have Holes: బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు ఉన్నాయి..? కారణం తెలిస్తే షాకవుతారు!
Advertisement

Why Biscuits Have Holes: బిస్కెట్.. ఒక కప్పు టీలో ముంచుకొని తింటుంటే ఆ మజానా వేరు. ఓ కప్పు టీ కడుపులో పడితే గానీ మనుసు కుదటపడని వారెందరో.. టీ మాత్రమే కాకుండా టీ లోకి బిస్కెట్స్ చాలా ఇష్టపడతారు. ఇంతకీ టీతో పాటు బిస్కెట్స్ ఎందుకు తింటున్నారు? అసలు ఈ బిస్కెట్ల గురించి ఏదైనా రహస్యం ఉందనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం.

బిస్కెట్ల గురించి సీక్రెట్ ఏంటంటే.. మీరు తినే బిస్కెట్లకు కొన్నింటికి రంధ్రాలు ఉంటాయి. మరికొన్నింటికి రంధ్రాలు ఉండవు. అలా ఎందుకు ఉంటాయో తెలుసా..? ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ రంధ్రాలు డిజైన్ కోసం అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. దీని వెనుకు పెద్ద రహస్యమే ఉంది. బిస్కెట్లకు ఉండే రంధ్రాలను డాకర్స్ అంటారు. బిస్కెట్లలో గాలి వెళ్లేందుకు ఈ రంధ్రాలు ఉంటాయి. మనుషులకైతే గాలి అవసరం కానీ బిస్కెట్లకు ఎందుకు అనే ప్రశ్న మొదలైందా? అదేంటో ఇప్పుడు చూద్దాం..!

Advertisement

నిజానికి బిస్కెట్‌లకు రంధ్రాలు చేయడం అనేది వాటి బేకింగ్‌కు సంబంధించిన అంశం. బేకింగ్ సమయంలో గాలి బిస్కెట్లలోని రంధ్రాల ద్వారా సులభంగా వెళుతుంది. బిస్కెట్లకు రంధ్రాలు చేయకుంటే.. బేకింగ్ సమయంలో గాలి బిస్కెట్‌లో చేరుతుంది. దీని వల్ల బిస్కెట్ ఆకారం చెడిపోతుంది. బిస్కెట్లకు రంధ్రాలు చేయకుండా కాల్చితే అవి ఎక్కువగా ఉబ్బి పగిలిపోతాయి. అందుకే బిస్కెట్‌లో గాలి బయటకు వచ్చేలా రంధ్రాలు చేస్తారు.

బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు చేస్తారో తెలుసుకున్నారు. బిస్కెట్ల ఎలా తయారు చేస్తారో కూడా చూడండి. బిస్కెట్ల తయారీకి కావాలసిన పదార్థాలు పిండి, పంచదార. ఈ రెండింటిని మిక్స్ చేసి.. ఆ పదార్థాన్ని అచ్చులో వేసి ఒక యంత్రం కింద ఉంచుతారు. ఆ యంత్రం బిస్కెట్లకు సమాన దూరంలో రంధ్రాలు చేస్తుంది. రంధ్రాల కారణంగా బిస్కెట్ చుట్టూ సమానంగా ఉబ్బుతుంది. దీని వల్ల బిస్కెట్ బేకింగ్ కూడా సులభంగా జరుగుతుంది. ఉప్పగా, తీపి ఉండే బిస్కెట్లలో రంధ్రాలు ఉండటం వల్ల అవి క్రిస్పీగా ఉంటాయి. బిస్కెట్లకు రంధ్రాలు చేయడం వల్ల ఉడికించినప్పుడు క్రంచీగా మారుతాయి. బిస్కెట్ల రంధ్రాల వెనుకున్న రహస్యం ఇదే. ఈ సారి బిస్కెట్ తినేప్పుడు ఓసారి బిస్కెట్‌పై ఓ లుక్కేయండి మరి..!

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×