Big Stories

Posani krishna Murali:- 20 రోజుల్లో 7 కిలోలు బ‌రువు త‌గ్గాను.. చ‌చ్చిపోతాన‌ని డిసైడ్ అయిపోయాను: పోసాని

Posani krishna Murali:- ర‌చ‌యిత‌, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు పోసాని ఇప్పుడు ఏపీలో ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా కొనసాగుతున్నారు. తాజా ఇంట‌ర్వ్యూలో ఆయ‌న తాను ఎదుర్కొన్నా ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఓ విషయాన్ని చెప్పారు. ‘‘వైసీపీ పార్టీ కోసం 2019 ఎన్నిక‌ల్లో ప‌ని చేశాను. అప్పుడు నాకు హెర్నియా స‌మ‌స్య వ‌చ్చింది. దాంతో నేను హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యాను. ఆప‌రేష‌న్ జ‌రిగింది. కానీ ఆరోగ్య ప‌రిస్థితి మాత్రం దిగ‌జారుతూ వ‌చ్చింది. 20 రోజుల్లోనే ఏడు కిలోలు త‌గ్గిపోయాను. ఇక బ‌త‌క‌ను అని నేను డిసైడ్ అయిపోయాను. నాతో పాటు నా భార్య కూడా నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఇంజ‌క్ష‌న్స్ ఇస్తుంటే ఇవ్వ‌కండ‌ని, దాని వ‌ల్ల కిడ్నీలు పాడ‌య్యే ప్ర‌మాదం ఉందని చెప్పేశాను. వాళ్లు కూడా నా మాట‌ల‌కు విలువిచ్చారు. ఉన్న కొన్ని రోజులైనా నా పిల్ల‌ల‌తో ఆనందంగా ఉండాల‌నే అలా చెప్పాను.

- Advertisement -

ఆ స‌మ‌యంలో లండ‌న్ నుంచి వేణు అనే డాక్ట‌ర్ ఫోన్ చేస్తే ఆయ‌న‌కు ఫోన్ చేసి చెప్పాను. ఆయ‌న వెంట‌నే హైద‌రాబాద్‌కి వ‌చ్చేశారు. నన్ను చూసి షాక‌య్యారు. పుల్ల‌లాగా అయిపోయాను. ఆయ‌న ఒకే ఒక చికిత్స చేస్తానని, కో ఆప‌రేట్ చేయ‌మ‌న్నారు. నేను కూడా స‌రేన‌న్నా. ఆయ‌న టెస్ట్ చేసి చూసి లోప‌ల ఇన్‌ఫెక్ష‌న్ ఎక్క‌డుందో క‌నిపెట్టేశారు. వెంట‌నే మ‌ళ్లీ ఆప‌రేష‌న్ చేసి ఇన్‌ఫెక్ష‌న్‌ తీసేశారు. ఆప‌రేష‌న్ జ‌రిగిన త‌ర్వాత రోజు పొద్దునే లేచి కూర్చున్నాను’’ అన్నారు పోసాని కృష్ణ ముర‌ళి.

- Advertisement -

త‌ర్వాత పోసాని మాట్లాడుతూ వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత సీఎం వై.ఎస్‌.జ‌గ‌న్ త‌న మ‌నుషుల‌తో పిలిపించారని, అయితే కూడా తాను వెళ్ల‌లేద‌ని అందుకు కార‌ణం తాను ఎలాంటి ప‌ద‌వులు ఆశించ‌లేద‌ని, చివ‌ర‌కు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో క‌బురు పంపించి పిలిపించార‌ని.. త‌ర్వాతే ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చార‌న్నారు. అదే సందర్బంలో నంది అవార్డులపై కూడా ఆయన స్పందించారు.

‘గేమ్ చేంజర్’ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేద్దామంటే నేనే వ‌ద్ద‌న్నా: దిల్ రాజు

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News