BigTV English

Pottel Movie : ‘పొట్టేల్’ ఓ లాజిక్ లెస్ స్టోరీ… స్టేజ్‌పైనే ఒప్పుకున్న డైరెక్టర్

Pottel Movie : ‘పొట్టేల్’ ఓ లాజిక్ లెస్ స్టోరీ… స్టేజ్‌పైనే ఒప్పుకున్న డైరెక్టర్

Pottel Movie : తెలుగమ్మాయి అనన్య నాగళ్ల  హీరోయిన్ గా నటించిన ‘పొట్టేల్’ (Pottel Movie) మూవీ గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది. ప్రమోషన్స్ నుంచి మొదలు పెడితే ఈ సినిమాకు సంబంధించి ఎదురైన కాంట్రవర్సీ ప్రశ్నలు, వాటికి అనన్య సమాధానాలు వంటి వివాదాలతో ఈ సినిమా నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అంటూ విమర్శలు వినిపించాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ స్టేజ్ పైనే ఈ విషయాన్ని ఒప్పుకోవడం విశేషం.


యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల  జంటగా నటించిన సినిమా ‘పొట్టేల్’ (Pottel ). నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ నిషా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ‘పొట్టేల్’ 1970, 81 దశకంలో కొనసాగుతుంది. సినిమా మొత్తం తెలంగాణ,  మహారాష్ట్ర సరిహద్దుల్లోని గుర్రం గట్టు అనే ఊర్లో జరుగుతుంది.

ప్రతి జాతరకి పొట్టేలుని బలి ఇవ్వడం ఆ ఊరి ఆనవాయితీ . కానీ రెండుసార్లు జాతరకు ముందే పొట్టేలు చనిపోవడంతో ఆ ఊరిలో కరువు తాండవిస్తుంది. పటేల్, పట్వారి ఛాయలు కొనసాగుతున్న కాలంలో ఆ ఊరిలో ‘పటేల్’ తనకు అమ్మవారు పూనిందనే బూటకపు నాటకంతో ఆ గ్రామంలో దురాగతాలకు పాల్పడతాడు. ఎప్పటిలాగే ఆ ఏడాది బలి ఇవ్వాల్సిన పొట్టేలు గంగాధరి సంరక్షణలో ఉంటుంది. కానీ అది మాయమవడంతో పటేల్తో పాటు ఊరంతా అతనిపై కన్నేర్ర చేస్తారు. అలాగే అమ్మవారి పొట్టేలుని తీసుకురాకపోతే బడికి వెళ్తున్న గంగాధరి కూతురు సరస్వతిని బలి కోరతాడు పటేల్. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ.


అయితే పొట్టేలు (Pottel ) స్టోరీలో ఒక తీవ్రమైన సామాజిక అంశాన్ని ప్రస్తావించారు. కానీ సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. సిన్సియర్ ప్రయత్నం అయినప్పటికీ పవర్ ఫుల్ గా లేకపోవడంతో సినిమాకు ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ రావట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కొంతమంది విలేకరులు ఈ సినిమా గురించి సూటిగా డైరెక్టర్ ను ప్రశ్నించారు.

పట్వారి విధానం అనేది ఎన్టీఆర్ సీఎం అయిన 1984లోనే అంతమైంది. అలాంటిది సినిమాలో 90లో వచ్చిన ‘శివ’ సినిమాను ఎందుకు చూపించారు ? ‘రాజా విక్రమార్క’ సినిమాలోని పాటలను ఎందుకు చూపించారు? అనే ప్రశ్న ఎదురయింది. అయితే డైరెక్టర్ చిరంజీవి పాటలు అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. అలా ఎలా సమాధానం దాటవేస్తారు. అది లాజిక్ లెస్ కదా… మీరు ఇంత పద్ధతిగా సినిమా తీసి ఇలాంటి లాజిక్ లెస్ పాయింట్స్ ఎందుకు పెట్టారు ? అని అడగగా… ఎన్టీఆర్ 89లో కూడా సీఎం అయ్యారంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జర్నలిస్టులు వదలకుండా వదలకపోవడంతో… కావాలనే ఇలాంటి లాజిక్ లెస్ పాయింట్స్ తీసుకున్నట్టు డైరెక్టర్ అంగీకరించడం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×