BigTV English

Watch Video : రోహిత్ శర్మ పైకి దూసుకు వచ్చిన ఫ్యాన్.. జాతీయ జెండా పట్టుకొని మరి

Watch Video : రోహిత్ శర్మ పైకి దూసుకు వచ్చిన ఫ్యాన్.. జాతీయ జెండా పట్టుకొని మరి

Watch Video : ముంబై లోని వాంఖడే స్టేడియంలో కొత్తగా నామకరణం చేసిన స్టాండ్ల ప్రారంభోత్సవాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, హిట్ మ్యాన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, NCP-SCP చీఫ్ శరద్ పవార్ హాజరై ప్రారంభించారు. ఈ స్టేడియంలోని 3 స్టాండ్స్ కి రోహిత్ శర్మ, శరద్ పవార్, మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ పేర్లను.. ఆఫీస్ లాంజ్ కి ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అమోల్ కాలే పేరును పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెమెరా ముందు ఫోటోలు దిగుతుంటే.. ఓ అభిమాని స్టేడియం వద్దకు భారత జెండా పట్టుకొని రోహిత్ శర్మ ముందు ఊపాడు. రోహిత్ శర్మ ఆ అభిమాని ని చూసి కాస్త భయపడ్డాడు. అలా భయపెడతావా..? అని రోహిత్ ఆ అభిమాని ని కొట్టబోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read :  IPL – WWE : ఫైనల్స్ లో బెంగళూరు… కాల యముడిలా సిద్ధంగా ఉన్న ముంబై

ఇక ఆ తరువాత రోహిత్ శర్మ ఆ అభిమానిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.  ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి రోహిత్ కి అరుదైన గౌరవం దక్కిందనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ తల్లిదండ్రులు, సతీమణి రితిక కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ముంబై లోని వాంఖడే స్టేడియంతో తనకు ఉన్నటువంటి పలు అనుభవాలు, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇక భవిష్యత్ లో వన్డే ఫార్మాట్ లో టీమిండియా తరపున వాంఖడే స్టేడియంలో ఆడాలనుందని వెల్లడించాడు రోహిత్ శర్మ. వాంఖడే స్టేడియం స్టాండ్ కి తన పేరు పెడతారని తానెప్పుడు కూడా ఊహించలేదని తెలిపాడు. చిన్నప్పుడు ముంబై తరపున.. టీమిండియా తరపు ఆడాలని కోరుకున్నప్పుడు వీటి గురించి ఆలోచించలేదు. ఏ ఆటగాడికైనా మంచి ప్రదర్శన ఇవ్వాలని.. దేశానికి సేవ చేయాలనే ఉంటుంది.  


ఈ తరుణంలో ఎన్నో మైలు రాళ్లు సాధిస్తామని.. వాటననింటి కంటే కూడా ఇది చాలా ప్రత్యేకమని తెలిపారు. వాంఖడే గొప్ప స్టేడియం అని.. దీంతో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని.. గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల మధ్యలో పేరు ఉండటాన్ని తాను మాటల్లో చెప్పలేనని పేర్కొన్నారు. ఇందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే తాను టీ-20, టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యానని.. ఇప్పటికీ ఇంకో ఫార్మాట్ లో ఆడుతున్నాను. ఇక్కడికి 21న ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై తరపున ఐపీఎల్ ఆడేందుకు వస్తున్నానని.. అప్పుడు ప్రత్యేక అనుభూతి దక్కుతుందని వెల్లడించాడు. “ఏ జట్టుతోనైనా టీమిండియా తరపున ఆడటం నాకు మరింత ప్రత్యేకంగా నిలవనుంది. ఈ గౌరవాన్ని నా కుటుంబ సభ్యుల ముందు అందుకోవడం గొప్ప విషయం”అని రోహిత్ తెలిపాడు. ఇక ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, మన్కడ్ దిలీప్ వెంగ్ సర్కార్ల పేర్లతో స్టాండ్లు ఉన్నాయి. తాజాగా రోహిత్ శర్మ, శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లను ఆవిష్కరించారు. 

–mTb-5/?igsh=MW0yeGtud2RudzA1aA==

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×