BigTV English

Shahid Kapoor: ప్రేమ పేరుతో నన్ను ఇద్దరు మోసం చేశారు: స్టార్ హీరో.. ఆ ఇద్దరు ఎవరంటే..?

Shahid Kapoor: ప్రేమ పేరుతో నన్ను ఇద్దరు మోసం చేశారు: స్టార్ హీరో.. ఆ ఇద్దరు ఎవరంటే..?

Shahid Kapoor: ప్రేమ (లవ్).. ఈ పేరు తెలియని వారుండరు.. అందులో మునిగి తేలని వారు కూడా ఉండరు. అక్షరాలు రెండే అయినా.. గుండెల్లో గుచ్చే అంత బాధ ఈ పేరులో ఉంటుంది. ఆ బాధని ఇప్పటి జనరేషన్ వాళ్లు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అయితే వాటి నుంచి తట్టుకుని బయటకు వచ్చి ఉత్తమమైన మార్గంలో ఉన్నత శిఖరాలను అందుకున్నవారు ఎందరో ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా ఒకడు.


‘ఇష్క్ విష్క్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన షాహిద్ కపూర్.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా వివాహ్ సినిమాతో మంచి హిట్ అందుకుని తనేంటో అందరికీ తెలిసేలా చేశాడు. ఆపై జబ్ వుయ్ మెట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో షాహిద్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో లవర్ బాయ్‌గా గుర్తింపు పొందాడు. దీని తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించాడు. కమీనీ, ఉడ్తా పంజాబ్, హైదర్, పద్మావత్, కబీర్ సింగ్, ఫర్జీ, జెర్సీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి బాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.

ఇక కెరీర్ పరంగా ఎలాంటి డోకా లేకుండా లవర్ బాయ్ పేరు సంపాదించుకున్న షాహిద్.. నిజ జీవితంలో మాత్రం లవ్‌లో ఓడిపోయాడు. ఈ విషయాన్ని అతడే తాజాగా వెల్లడించాడు. రీసెంట్‌గా నటి నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్‌ల గురించి షాహిద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Also Read: సౌత్ ప్రేక్షకులు హిందీ సినిమాలను యాక్సెప్ట్ చేయరు

ఇక ఈ ఇంటర్వ్యూలో మీరు లవ్‌లో ఎన్ని సార్లు మోసపోయారు? అని నేహా అడగ్గా.. ముందుగా షాహిద్ నవ్వుకున్నాడు. ఆ తర్వాత.. ప్రేమ పేరుతో తనను ఇద్దరు మోసం చేశారని అన్నాడు. తాను ఒకటి కచ్చితంగా అనుకుంటున్నాను అన్నాడు. మరొకదాని గురించి పెద్దగా సందేహాలు ఉన్నాయని తెలిపాడు. రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యా అని అనుకుంటున్నాని.. కానీ వారి పేర్లను చెప్పను అని షాహిద్ చెప్పుకొచ్చాడు.

దీంతో అతడికి బ్రేకప్ చెప్పిన వారి పేర్లు మాత్రం చెప్పకపోవడంతో.. నేహా ధూపియా ఇలా అన్నారు.. మీరు డేటింగ్ చేసిన ఆ ఇద్దరు (కరీనా కపూర్, ప్రియాంక చోప్రా) కదా? అని అన్నారు. దాంతో తాను పేర్లు చెప్పనని.. మీరు వేరొక ప్రశ్న అడగండి అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన షాహిద్.. మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. అతడికి ఇద్దరు సంతానం కలరు. అందులో ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×