BigTV English

The Raja Saab : కొత్త షెడ్యూల్ వచ్చింది… కానీ నమ్మకం లేదు దొర

The Raja Saab : కొత్త షెడ్యూల్ వచ్చింది… కానీ నమ్మకం లేదు దొర

The Raja Saab : బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పాలి. కేవలం తెలుగు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగింది. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత తాను చేసిన ప్రతి సినిమా కూడా అదే రేంజ్ లో విడుదలవుతుంది. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు. రీసెంట్ గానే కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.


రాజా సాబ్ పరిస్థితి ఏంటి

ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మారుతి ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు. మొదటిసారి ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో సినిమాను చేస్తున్నాడు మారుతి. అయితే ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాలు తర్వాత ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఏ దర్శకుడు బయటకు తీయలేదు. ఇప్పుడు అదే ప్రయత్నాన్ని మారుతి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మారుతీ కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ 18వ తారీకు నుంచి కానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడుకి పూర్తవుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ప్రభాస్ లైనప్

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాతో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సీతారామం వంటి హిట్ సినిమా తర్వాత అను చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలానే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్ కూడా దాదాపు 70% పూర్తయిపోయింది. ఇన్ని సినిమాల అప్డేట్స్ ఉన్నా కూడా మళ్లీ రాజా సాబ్ షూటింగ్ మొదలవడం ఏంటో ప్రభాస్ అభిమానులకు అర్థం కాని పరిస్థితి.

Also Read : Vishwambhara Teaser: విశ్వంభర లో ఉన్నది ఒరిజినల్ ఫుటేజ్ కాదు, అందుకే టీం వెనకడుగు వేస్తుందా.?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×