Vishwambhara Teaser: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతరులను అనిల్ రావిపూడి తో కూడా సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా సంక్రాంతికి విడుదలవబోతున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యేటట్లు అనిల్ రావిపూడి ఆ సినిమాను ప్లాన్ చేస్తాడు. కానీ ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి కంటే ముందు వశిష్ట దర్శకుడిగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమాను మొదలుపెట్టారు. బింబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు వశిష్ట. బాక్స్ ఆఫీస్ వద్ద బింబిసార సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ నమ్మకంతోనే మెగాస్టార్ చిరంజీవి కూడా వశిష్టకు అవకాశం ఇచ్చారు. విశ్వంభర సోషియో ఫాంటసీ సినిమాగా ఉండబోతున్నట్లు అభిమానులకి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు.
ఒరిజినల్ ఫుటేజ్ కాదు
విశ్వంభర సినిమాను మొదలు పెట్టినప్పుడు సంక్రాంతి కానుక విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఆ టైం కి రెడీ అవ్వడంతో ఆ సినిమా కోసమే ఈ సినిమాను వెనక్కు తగ్గుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే విశ్వంభర సినిమాకు సంబంధించి అప్పట్లో టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఆ టీజర్ కి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఆ టీజర్ గురించి వశిష్ట తండ్రి సత్యనారాయణ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ టీజర్ అంతా కూడా ఏఐ జనరేటర్ తో క్రియేట్ చేసింది. టీజర్ లో చూసిన ఫుటేజ్ సినిమాలో ఉండదు అని తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ అవుట్ పుట్ రాకపోవడం వలన అలానే రిలీజ్ డేట్ దగ్గరగా ఉండటం వలన టీజర్ హడావిడిగా విడుదల చేశారు.
Also Read : HIT 3 Censor : సెన్సార్ రిపోర్ట్… నాని వీరంగం… చూస్తే భయపడాల్సిందే..
టీం వెనకడుగు వేస్తుంది
విశ్వంభర టీజర్ పై విమర్శలు రావడం అనేది చిత్ర యూనిట్ కి కూడా చేరింది. అందువల్లనే టీం సినిమా విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి క్వాలిటీ కంటెంట్ ఇచ్చే విధంగా వశిష్ట ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్లు. ఈ సినిమా కొంచెం రిలీజ్ లేట్ అవ్వచ్చు కానీ రిలీజ్ అవ్వడం మాత్రం పక్కా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా క్వాలిటీ కంటెంట్ తో సినిమా బయటకు వస్తే ఆ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. కొంచెం తేడా కొట్టినా కూడా అదే ఆడియన్స్ ఆ సినిమాను తిట్టడం కూడా మొదలుపెడతారు.హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. ఈ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.