BigTV English

Prabhas Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఫౌజీ’

Prabhas Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఫౌజీ’

Prabhas Fauji pooja Ceremony(Latest news in tollywood): ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా.. కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేసింది. బాక్సాఫీసును షేక్ చేసి అందరినీ ఆశ్యర్యపరచింది. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అతి కొద్ది రోజుల్లోనే కల్కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసింది. ఇందులో భాగంగానే దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.


ఇక ప్రభాస్ ఈ మూవీ సక్సెస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయాడు. తన లైనప్‌లో ఇప్పటికి చాలా సినిమాలే ఉన్నాయి. అందులో ఓ సినిమా ఇప్పుడు పట్టాలెక్కింది. తన తదుపరి సినిమాను ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ‘ఫౌజీ’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే అప్డేట్.. సుభాష్ చంద్రబోస్ పాత్రలో ప్రభాస్..!


ఈ పూజా కార్యక్రమంలో ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకను పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రామ్‌లా నిర్వహించారు. ఈ వేడుకకు మూవీ నుంచి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల అంటే ఆగస్టు 23 నుంచి స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా ఈ అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాకి సంబంధించిన నటీ నటులు, ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

ప్రభాస్ లైనప్‌లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో దర్శకుడు మారుతీతో ‘రాజా సాబ్’ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ లవర్ బాయ్‌లా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు సందీప్ ఇప్పటికే హైప్ పెంచేశాడు. ప్రభాస్‌ను ఇప్పటి వరకు చూడని అవతార్‌లో చూపిస్తానంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత సలార్ 2 కూడా ప్రభాస్ లైనప్‌లో ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×