BigTV English

CM Revanth Delhi Tour: కొత్త పీసీసీ అధ్యక్షుడు.. కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ చర్చ

CM Revanth Delhi Tour: కొత్త పీసీసీ అధ్యక్షుడు.. కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ చర్చ

CM Revanth Discussion About New PCC chief & Cabinet Expansion: తెలంగాణలో TPCC అధ్యక్షుడి నియామకం, కేబినెట్‌ విస్తరణపై ఉత్కంఠకు ఇంకా తెర పడలేదు. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటనలో ఈ రెండు విషయాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. TPCC కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరారు సీఎం రేవంత్‌ రెడ్డి. TPCC అధ్యక్షుడి నియామకం వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త TPCC అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తాను కలిసి పనిచేసేందుకు సిద్ధమని రేవంత్‌ తెలిపినట్టు సమాచారం.


ఢిల్లీలో సీఎం రేవంత్‌ పర్యటనలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ తదితర ఆంశాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పదవుల భర్తీల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశాలపై మంతనాలు జరిపినట్టు సమాచారం. రైతు రుణ మాఫీ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ, సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా చర్చించి, ఆహ్వానించినట్టు సమాచారం. అనంతరం AICC సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తోనూ రేవంత్‌ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన, నాలుగో సిటీకి మెట్రో ప్లాన్, కాకపోతే..


ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఢిల్లీలో భేటీ అయ్యారు. విదేశాల్లో పర్యటించిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు ఎంత వరకు రాబట్టారు. ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయి.. అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ అయిన సందర్బంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గంటకు పైగా వారితో చర్చించారు.

అయితే ఈ చర్చలో భాగంగా తెలంగాణాకు వస్తున్న పెట్టుబడులు, తాజా రాజకీయ పరిస్థితులు గురించి ప్రధానంగా చర్చించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా సింఘ్వీని ప్రకటించిన అనంతరం తొలిసారి ఇద్దరూ సమావేశమయ్యారు. సెప్టెంబర్‌ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 21న నామినేషన్‌ దాఖలు సహా వివిధ అంశాలపై లోతుగా చర్చించినట్టు అభిషేక్‌ మను సింఘ్వీ ట్వీట్‌ చేశారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×