Prabhas : టాలీవుడ్ స్టార్, పాన్ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని ఎప్పుడో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.. సెప్టెంబర్ లో సినిమాను పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే డార్లింగ్ సమ్మర్ వేకేషన్ కోసం ఇటలీకి వెళ్లాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అయితే షూటింగ్ కన్నా ముందు ఎడిటింగ్ పై ఫోకస్ పెట్టినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..
ఫౌజీ సెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్..
ప్రభాస్ ప్రతి సమ్మర్ కు విదేశాలకు వెళ్లి చిల్ అవుతాడన్న సంగతి తెలిసిందే.. అలాగే ఈ ఏడాది కూడా ఇటలీకి వెళ్లాడు. తన సమ్మర్ వేకేషన్ పూర్తి చేసుకొని నేడే తిరిగి ఇండియాకు వచ్చేసాడు. రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సోషల్‌మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజాగా మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది.. రేపు సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడని టాక్.. డైరెక్టర్ హడావిడి ఎక్కువ చేస్తున్నాడని ప్రభాస్ కోపడ్డాడట..కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ ను పిలిచి కూర్చోపెట్టి, హడావిడి పడద్దుని, కూల్ గా ఉంటేనే మంచి ఔట్‌పుట్ వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని ముచ్చటించుకుంటున్నారు. వేకేషన్ నుంచి వచ్చి రాగానే డైరెక్టర్ పై డార్లింగ్ సీరియస్ అయ్యాడట..
Also Read :పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. అదే లాస్ట్..?
డూప్ ల పై ఫోకస్ పెడుతున్న ప్రభాస్..
ప్రభాస్ సినిమాలు అనగానే భారీ బడ్జెట్ తో పాటు భారీ యాక్షన్స్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. కచ్చితంగా ఈయన సినిమాల్లో డూప్ ఉండాల్సిందే.. అలాగే ఈ పౌజీ సినిమాలో ఇద్దరు డూపులు ఉన్నారని టాక్. అయితే రేపు ఫౌజీ ఎడిట్ రూంలో కూర్చుండి ఇప్పటి వరకు బాడీ డబుల్ ఎలా చేశాడో అనేది రేపు చెక్ చేస్తాడని టాక్..ఒక వేళ ఆ డూప్ వ్యక్తి సరిగ్గా చేయకపోతే… ప్రభాస్ కు నచ్చకపోతే… ఆ డూప్ తో రీ షూట్స్ చేయించే ఛాన్స్ ఉందని నెట్టింట టాక్.. నిజానికి ప్రభాస్ కు ఇద్దరు ఉన్నారు డూప్ లు.. వారితోనే ఫౌజీ సినిమా చేస్తున్నట్టు సమాచారం. రేపు ఎడిటింగ్ రూం కి వెళ్తాడని, అక్కడ.. ఆ డూప్ లు చేసిన యాక్టింగ్ చెక్ చేస్తాడని, డూప్ యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే అది .. ప్రభాస్ కి నచ్చకపోతే మళ్లీ రీ షూట్స్ చేయిస్తాడని సమాచారం.. ఏది ఏమైన కూడా డార్లింగ్ మళ్లీ షూటింగ్ లో బిజీ అయ్యాడు.. సెప్టెంబర్ లో ఈ మూవీ పక్కా వస్తుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..