Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్య రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. సీఎం తర్వాత రాష్ట్ర బాధ్యతలను ఆయన భుజాలపై మోస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.. గతంలో కమిట్ అయిన సినిమాలను ఇంకా పూర్తి చెయ్యలేని పరిస్థితి. అయితే తన వల్ల ఎవరు నష్టపోవద్దని పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చారు. వీలు చూసుకుని సినిమా షూటింగ్లకు అటెండ్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలను కంటిన్యూ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఇక సినిమాలకు పూర్తిగా దూరమైపోతారని తెలుస్తుంది.
ఏపీ డిప్యూటీ సీఏం గా పవన్ కళ్యాణ్..
రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. గతంలో పార్టీ తరఫున పోటీలో నిలబడి కొన్నిచోట్ల ఓడిపోయినా మరికొన్ని చోట్ల స్థానాలను దక్కించుకున్నారు. ఈ మధ్య జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్తూ ప్రజల యోగక్షేమాలను కనుక్కుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న కొన్ని సినిమాలు సైతం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక ఆ చిత్రం నిర్మాతలు రిక్వెస్ట్ చెయ్యడంతో కష్టమైన పర్లేదు పూర్తి చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.
సినిమాలకు కంటిన్యూ చేస్తారా..?
గతంలో కమిటైన మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆయన నుంచి సినిమాని అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ల కోరికను కాదనలేక కమిటీ అయిన సినిమాలను థియేటర్లలోకి తీసుకురావాలనే అనుకుంటున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలకు సైన్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మిగిలిన రెండు సినిమాల్లో ఓజీ సినిమా కూడా షూటింగ్ పూర్తికా వచ్చింది. ఆ తర్వాత హరి శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారా? లేదా? అన్న ప్రశ్నలు జనాలు మెదులుతున్నాయి…
సినిమాలకు పులు స్టాప్ పెట్టిన పవన్ కళ్యాణ్.. కారణం..?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చివరి సినిమా గురించి ప్రస్థావించినట్టుగా తెలుస్తోంది. తనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓ సినిమా చేసి పెట్టమని అడిగాడట. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అన్నాడట. ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుందట. అందుకే ఇక చెయ్యనని అంటున్నారు. అయితే ఈ మంత్రి మాత్రం గతంలో సినిమాలు చేస్తానని అన్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెట్‌లో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఓజీ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది. ఇక ఈ నెలలోనే షూట్ మొత్తం పూర్తి చేసేలా ఉన్నారు. సెప్టెంబర్‌లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఇకముందు పవన్ కళ్యాణ్ నిర్ణయం మారుతుందేమో చూడాలి..