E-Paper
Advertisement

Prabhas : కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. ముంబైలో సలార్ రికార్డ్..

Prabhas : కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. ముంబైలో సలార్ రికార్డ్..
Advertisement

Prabhas : ప్రభాస్.. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా వరల్డ్ వైడ్ ఫ్యాన్ వేస్ ఏర్పాటు చేసుకున్న నటుడు. గత రెండు సంవత్సరాలుగా అందరూ నిరీక్షిస్తున్న సలార్ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక సలార్ మూవీ విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టించే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం సలార్ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ రికార్డు కూడా నెలకొల్పింది మన సౌత్ లో కాదు.. నార్త్ లో ఢంకా బజాయించి మరి సలార్ సత్తా చాటుతున్నారు అభిమానులు. ఇంతకీ విషయం ఏమిటంటే ముంబైలోనే ఎప్పుడు బిజీగా ఉండే ప్రాంతంగా గుర్తింపు పొందిన ఆర్ మాల్‌ వద్ద.. ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్‌.. అతని అభిమానుల అభిమానానికి నిర్వచనంలా నిలబడి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

సలార్ విడుదల సమయం దగ్గర పడుతున్న ప్రమోషన్స్ సౌండ్ ఆశించిన విధంగా లేదు అని అభిమానులు భావిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వస్తున్న ప్రభాస్ మూవీ అంటే హడావిడి ఏ రేంజ్ లో ఉండాలి. సలార్ కు సంబంధించిన ప్రమోషన్స్ అభిమానులను నిరుత్సాహ పరిచే విధంగా ఉన్నాయి. ఆల్రెడీ సినిమాకి ఉన్న పాజిటివ్ బజ్ ,హైప్ దృష్టిలో పెట్టుకుని.. చిత్ర బృందం సింపుల్‌ గా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అందరూ భావిస్తున్నారు.

ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ముంబైలో ఆర్ మాల్‌ వద్ద 120 అడుగుల ఎత్తయిన ప్రభాస్ కటౌట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను మూవీ నిర్మాణ సంస్థ హెంబలే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ భారీ కటౌట్ కి ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు. మిర్చిలో ప్రభాస్ చెప్పిన కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ డైలాగ్ కి.. నిర్వచనంగా ఉంది ఈ పోస్టర్.

Advertisement

ఈ ఒక్క కటౌట్ చూస్తే చాలు.. మూవీ కలెక్షన్స్ ఎంత భారీగా ఉంటాయో అర్థం అయిపోతుంది అంటున్నారు నెటిజెన్స్. ఆర్‌ మాల్ వద్ద ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన అన్ని కటౌట్స్ లోకి ఇది అత్యంత భారీ కట్ అవుట్ కావడం గమనార్హం. మరి విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న సలార్ విడుదల తర్వాత మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×