BigTV English

Drugs : హైదరాబాద్‌లో స్పెషల్ రైడ్స్.. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్..

Drugs : హైదరాబాద్‌లో స్పెషల్ రైడ్స్.. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్..

Drugs : సీఎం రేవంత్ సర్కారు.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో ఇద్దరు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 56 లక్షల రూపాయల విలువైన 3.5 కేజీల ఓపియంని పట్టుకున్నారు. అలానే 45 గ్రాముల పొప్పిస్ట్రా పౌడర్.. 2 లక్షల 80 వేల రూపాయల నగదు.. ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.


కాగా నూతన సంవత్సర వేడుకలని టార్గెట్ చేస్తూ.. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి.. ఒపియం, పొప్పీ స్ట్రా డ్రగ్స్ ను అక్రమంగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో రాజస్థాన్ కి చెందిన శశిపాల్ బిష్ణోయ్, మదన్ లాల్ బిష్ణోయ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ జైల్ కి వెళ్లొచ్చాడని అన్నారు.

వీరి అరెస్టుతో.. డ్రగ్స్ తో ఈవెంట్ చేసే వారికి బ్రేక్ వేసినట్లు అయ్యిందని పోలీసులు తెలిపారు. నిందితులు.. వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కి అమ్మడానికి చిన్న పాకెట్స్ గా తయారు చేశారని తేల్చారు. న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని పబ్స్, బార్ లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీపీ సుధీర్ బాబు చెప్పారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×