BigTV English

Prabhas: ఆ రెండు సినిమాటిక్ యూనివర్స్‌లలో ప్రభాస్.. యంగ్ డైరెక్టర్స్‌ను బ్లైండ్‌గా నమ్ముతున్న పాన్ ఇండియా స్టార్

Prabhas: ఆ రెండు సినిమాటిక్ యూనివర్స్‌లలో ప్రభాస్.. యంగ్ డైరెక్టర్స్‌ను బ్లైండ్‌గా నమ్ముతున్న పాన్ ఇండియా స్టార్

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ తన మనసుకు నచ్చినా కథలనే ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తను ఎంచుకున్న సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. దానిని పెద్దగా పట్టించుకోకుండా అప్‌కమింగ్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది కాబట్టి తనతో సినిమాలు చేయడానికి సీనియర్ దర్శకులు సైతం క్యూ కడతారు. కానీ ఈ హీరో మాత్రం ఇద్దరు యంగ్ డైరెక్టర్స్‌ను నమ్మడానికి సిద్ధమయ్యాడు. వారి సినిమాటిక్ యూనివర్స్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


సీక్వెల్స్‌తో బిజీ

మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ను పక్కన పెడితే ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాలు ఎక్కువశాతం సీక్వెల్సే. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’కు సంబంధించిన సీక్వెల్స్‌లో కూడా నటిస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి త్వరలోనే వాటిపై ఫోకస్ చేయనున్నాడు ఈ హీరో. ఇవి కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక ప్రేమకథలో నటించడానికి ప్రభాస్ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఈ ప్యాన్ ఇండియా స్టార్ అధికారికంగా ప్రకటించిన లైనప్ ఇదే. ఇవి కాకుండా మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ చెప్పిన కథలను ఓకే చేశాడట ప్రభాస్. ఆ యంగ్ డైరెక్టర్స్ మరెవరో కాదు.. ప్రశాంత్ వర్మ (Prasanth Varma), లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj).


Also Read: సక్సెస్ మంత్ర చెప్పిన కిరణ్ అబ్బవరం.. సక్సస్ అవ్వాలంటే ఇలా చేయండి.!

సినిమాటిక్ యూనివర్స్‌లోకి

ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనకరాజ్.. ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ సొంతంగా సినిమాటిక్ యూనివర్స్‌లు క్రియేట్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. లోకేశ్ కనకరాజ్ తమిళ దర్శకుడే అయినా కూడా తనకు తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులు క్రియేట్ చేసే సినిమాటిక్ యూనివర్స్‌లోకి ప్రభాస్ అడుగుపెట్టనున్నాడని సమాచారం. ఇప్పటికే లోకేశ్, ప్రశాంత్.. తమ అప్‌కమింగ్ సినిమాలు ఏంటి అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. వాటిలో ఏదో ఒక సినిమా ద్వారా ప్రభాస్ కూడా వీరి సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా అధికారిక ప్రకటన కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది.

అదే స్థానంలోకి ప్రభాస్

టాలీవుడ్‌లో ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలు రావాలని ఈ దర్శకుడు ముందుగానే ప్లాన్ చేశాడు. అలా తను ప్లాన్ చేసిన సినిమాల్లో ఒకటి ‘బ్రహ్మరాక్షస్’. ముందుగా ఈ మూవీలో రణవీర్ సింగ్‌ను హీరోగా అనుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత రణవీర్‌ను కలవడం, తనకు కథ వినిపించడం, తనతో టెస్ట్ షూట్ చేయడం కూడా జరిగాయి. కానీ ఇంతలోనే రణవీర్ టీమ్‌తో ప్రశాంత్‌కు విభేదాలు రావడంతో హీరో హర్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ‘బ్రహ్మరాక్షస్’లో రణవీర్ సింగ్ స్థానంలోకే ప్రభాస్ రానున్నాడనే వార్త గట్టిగా వినిపిస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×