BigTV English

Kiran Abbavaram: సక్సెస్ మంత్ర చెప్పిన కిరణ్ అబ్బవరం.. సక్సస్ అవ్వాలంటే ఇలా చేయండి.!

Kiran Abbavaram: సక్సెస్ మంత్ర చెప్పిన కిరణ్ అబ్బవరం.. సక్సస్ అవ్వాలంటే ఇలా చేయండి.!

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఎన్ని సినిమాలు చేసినా తనను సక్సెస్ మాత్రం వరించలేదు. అలాంటి తన కెరీర్‌లో మొదటిసారి ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ‘క’ సైతం పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది. ప్రీమియర్స్ నుండే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. దీంతో ‘క’ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో మూవీ టీమ్ అంతా ఒక సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో అసలు సక్సెస్ మంత్ర ఏంటో బయటపెట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).


తనే నా సక్సెస్‌కు కారణం

‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కిరణ్ అబ్బవరం భార్య రహస్య కూడా హాజరయ్యింది. అక్కడ స్టేజ్‌పైనే తన భర్త కోసం ఈ సినిమా చూడమని అడుగుతూ ఎమోషనల్ అయిపోయింది రహస్య. అలా ఈ సక్సెస్‌లో తను కూడా ఒక భాగమయ్యింది. ఇప్పుడు తను అనుకున్నట్టుగానే ‘క’ మూవీ సక్సెస్ సాధించడంతో రహస్య రియాక్షన్ ఏంటని కిరణ్ అబ్బవరంకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘ఏ భార్య అయినా కూడా తన భర్త సినిమా చూడమనే అడుగుతుంది. తనే నా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది’’ అంటూ తన భార్య రహస్య గురించి చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ‘క’ సినిమా విషయంలో ఆఫ్ స్క్రీన్ కూడా రహస్య ఎంతో కష్టపడింది.


Also Read: తెలుగు వాళ్ళంటే అంతే.. సంతోషంలో ఉప్పొంగిపోతున్న కిరణ్..!

ఈరోజు కోసమే ఎదురుచూశాను

‘‘చాలామంది పెళ్లయిన తర్వాత మంచి జరుగుతుంది అంటూ ఉంటే ఆ మంచి జరిగే రోజు కోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. కానీ ఇంత మంచి జరుగుతుందని అనుకోలేదు. ఎవరైనా సక్సెస్ రానివాళ్లు తొందరగా పెళ్లి చేసుకోండి సక్సెస్ వస్తుంది’’ అంటూ నవ్వుతూ సలహా ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. టాలీవుడ్‌లో చాలా తక్కువమంది హీరోహీరోయిన్లు మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందులో కిరణ్ అబ్బవరం, రహస్య కూడా ఒకరు. వీరిద్దరూ ‘రాజావారు రాణీగారు’ అనే మూవీతో ఒకేసారి ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లుగా అడుగుపెట్టారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నారు.

ప్రమోషన్స్ నిలబెట్టాయి

కిరణ్ అబ్బవరంతో ప్రేమలో పడిన తర్వాత సినిమాలను పూర్తిగా దూరం పెట్టేసింది రహస్య (Rahasya). కిరణ్ హీరోగా నటించిన ‘క’ ప్రొడక్షన్‌లో తను కూడా భాగమయ్యింది. తెలుగులోనే సరిగా మార్కెట్ లేని హీరోకు ప్యాన్ ఇండియా మూవీ అవసరమా అని ఎంతమంది ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కిరణ్ అబ్బవరం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ‘క’ (Ka) మూవీని ప్రమోట్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు. మొత్తానికి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి కిరణ్, రహస్య కలిసి చేసిన ప్రమోషన్స్ కీలకంగా మారాయి. అతి తక్కువ థియేటర్లలో విడుదలయిన ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో మరికొన్ని స్క్రీన్స్ కూడా యాడ్ అవ్వనున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×