BigTV English

Bigg Boss 8 Telugu Promo: ప్రేరణపై నాగార్జున ఫైర్.. కింగ్‌కే ఛాలెంజ్ విసిరిన గౌతమ్, చివరికి తప్పు తెలుసుకొని..

Bigg Boss 8 Telugu Promo: ప్రేరణపై నాగార్జున ఫైర్.. కింగ్‌కే ఛాలెంజ్ విసిరిన గౌతమ్, చివరికి తప్పు తెలుసుకొని..

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో గతవారంలో పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసిపోయి బీబీ ఇంటికి దారేది అనే ఛాలెంజ్‌ను ఆడారు. ఫైనల్‌గా ఆ ఆటలో గెలిచి అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. కానీ బీబీ ఇంటికి దారేది ఛాలెంజెస్‌లో భాగంగా చాలామంది కంటెస్టెంట్స్ చాలా తప్పులు చేశారు. కొందరు అయితే తమ టెంపర్ కోల్పోయి విచక్షణ లేకుండా ప్రవర్తించారు. వారిపై నాగార్జున సీరియస్ అయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో అందరి కంటెస్టెంట్స్ తప్పులను గుర్తుచేశారు నాగ్. ముఖ్యంగా ప్రేరణ, నిఖిల్, గౌతమ్‌పై సీరియస్ అవ్వగా.. గౌతమే తిరిగి నాగార్జునపై రివర్స్ అయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


నిజం బయటపడింది

కంటెస్టెంట్స్‌ చేసిన తప్పులకు క్లాస్ తీసుకోవడం కోసం ఒక ఆయుధాన్ని తీసుకొచ్చారు నాగార్జున. నయని పావనిని ప్రేరణ పుడింగి అనడాన్ని గుర్తుచేశారు. ‘‘మాటలు జాగ్రత్తగా రాని అని అందరికీ చెప్తూ ఉంటావు. నీ మాటలు జాగ్రత్తగా వస్తున్నాయా’’ అని ప్రేరణను అడిగారు నాగ్. ‘‘హ్యాట్ నామినేషన్స్ సమయంలో కూడా మేము మాట్లాడుతుంటే ప్రేరణ వచ్చి పో అంది’’ అని నయని పావని చెప్తుండగానే ప్రేరణ అడ్డుపడింది. దానికి కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. పానిపట్టు యుద్ధం టాస్క్ సమయంలో నిఖిల్‌ను నిజంగానే బూతు తిట్టింది ప్రేరణ. ఆ వీడియోను అందరికీ చూపించారు నాగ్. ఆపై దానిని వివరించమని ప్రేరణను అడిగారు.


Also Read: బిగ్ బాస్ లో చీకటి ప్రేమలు..అర్ధరాత్రి ఆ పనిచేస్తూ దొరికిన కంటెస్టెంట్స్..

రెచ్చిపోయిన నిఖిల్

‘‘అప్పుడు చాలా ఎమోషన్స్ వచ్చేశాయి’’ అని ప్రేరణ చెప్తుండగానే.. ‘‘అంటే నీవరకు వస్తే ఎమోషన్స్.. మిగతావాళ్లకు అయితే ఓకే’’ అని నాగార్జున అన్నారు. దాంతో ప్రేరణ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది. ‘‘పరిస్థితులు, హౌస్‌మేట్స్ కలిసి రెచ్చగొడితే రెచ్చిపోతావా’’ అని నిఖిల్‌తో మాట్లాడడం మొదలుపెట్టారు నాగ్. పానిపట్టు యుద్ధం టాస్క్‌లో నిఖిల్ ఏం చేశాడో వీడియో చూపించారు. హరితేజ ఆపేయమని అంటుంది అని నాగార్జున గుర్తుచేసినా ఆ సందర్భంలో తనకు వినిపించలేదని తప్పించుకుందామని అనుకున్నాడు నిఖిల్. ‘‘ఈ మాటలు ఏవీ వినిపించలేదు. ఒక్క మాట మాత్రమే వినిపించింది. దాంతో రెచ్చిపోయావు’’ అన్నారు నాగ్.

బయటికి వెళ్లిపోతా

పానిపట్టు యుద్ధం టాస్క్‌లోనే నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను చూపించారు నాగ్. ఆ వీడియోలో ఏమన్నావు అని గౌతమ్‌ను అడిగారు. ‘‘కోపంలో అతిగా వాగేసినట్టున్నాను కానీ కావాలని ఎలాంటి తప్పు పదం మాట్లాడలేదు’’ అని తనను తాను సపోర్ట్ చేసుకున్నాడు గౌతమ్. కానీ నాగార్జున అది నమ్మలేదు. ‘‘నేను తల్లి ప్రమాణంగా చెప్తున్నా అలాంటి పదం వాడలేదు. చేయని తప్పును ఒప్పుకోను. నిజంగా నేను చేశానని నిరూపిస్తే నేను బయటికి వెళ్లడానికి రెడీగా ఉన్నాను’’ అని నాగార్జునకే ఛాలెంజ్ విసిరాడు గౌతమ్. దీంతో కంటెస్టెంట్స్, ఆడియన్స్ అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు నాగ్. అందులో ఒక్కరు కూడా గౌతమ్ తప్పు చేయలేదని నమ్మలేదు. దీంతో గౌతమ్ తప్పు తెలుసుకొని ఎమోషనల్ అయ్యాడు.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×