Prabhas: ప్రభాస్ – ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హీరో. బాహుబలి తరువాత ఆయన రేంజ్ మారిపోయింది. సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి సినిమాలు కొన్ని మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, ప్రభాస్ మార్కెట్ ఎక్కడా తగ్గలేదు. సలార్ , కల్కి 2898 AD లాంటి సినిమాలతో ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయ్యి వెయ్యి కోట్లు రాబట్టాడు. ప్రభాస్ నెక్స్ట్ లైనప్ లో స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ హిట్ గ్యారెంటీ అని ఇప్పటికే ఆడియన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఇలాంటి లైనప్ మైంటైన్ చేస్తున్న ప్రభాస్, ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది..
ఈరోజు (మార్చి 22, 2025) సలార్ రీరిలీజ్ భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది. ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మోస్ట్ వాంటెడ్ మాన్ ట్యాగ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ గా థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో సిటీస్ లో ఫాన్స్ బానర్స్, బిగ్ స్క్రీన్ కటౌట్ లతో థియేటర్స్ ని ఫెస్టివల్ మూడ్ లో మార్చేశారు. ముఖ్యంగా విశ్వనాథ్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు బాహుబలి మూడో పార్ట్ డిమాండ్ చేస్తున్నారు.
దళపతి విజయ్ లియో సినిమాకి డిజైన్ చేసిన స్పెషల్ టైటిల్ కార్డ్ అప్పట్లో కోలీవుడ్ ఫ్యాన్స్ కి పెద్ద కిక్ ఇచ్చింది. విజయ్ పేరు రక్తంతో రాసినట్టుగా బ్లడీ కట్ ఎఫెక్ట్ తో వచ్చిన టైటిల్, థియేటర్స్ లో మాస్ రిస్పాన్స్ తెచ్చుకుంది. అయితే అదే స్టైల్ టాలీవుడ్ లో కాపీ అయ్యిందని ఇప్పుడు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సందీప్ కిషన్, సుదీర్ బాబు సినిమాల్లో ఇదే టైటిల్ కార్డ్ స్టైల్ వాడారని విమర్శలు వచ్చాయి. తాజాగా సలార్ రీరిలీజ్ షోలో కూడా ఇదే తప్పు జరిగింది. విశ్వనాథ్ థియేటర్ లో ప్రభాస్ టైటిల్ కార్డ్ యానిమేషన్ కూడా లియో టైటిల్ కార్డ్ ని పోలి ఉంది. కొంత మార్పులు చేసారు కానీ బేసిక్ ఐడియా మాత్రం అదే.
ఈ రీ-క్రియేషన్ వల్ల ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ కి కామెంట్స్ చేసే అవకాశం ఇచ్చినట్టయ్యింది. అసలు ఇలా టైటిల్ కార్డ్ కూడా కాపీ చేయాలా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ తమ హీరో పేరు గ్రాండ్ గా హైలైట్ చేయాలనుకుంటారు కానీ, ఇలా మార్పుల్లేకుండా ఓరిజినల్ ఐడియా ఉంటే ఇంకా బెటర్ అనేది నెటిజన్ల అభిప్రాయం. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా నెక్స్ట్ లెవెల్. సలార్ రీరిలీజ్ మళ్లీ ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. కానీ, టైటిల్ కార్డ్ వివాదం అనవసరంగా ఎలాంటి అవసరం లేని ట్రోలింగ్ కి కారణమైంది. ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఫ్యాన్స్ మరింత జాగ్రత్త పడితే బాగుంటుంది.