Illu Illalu Pillalu Today Episode March 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ చందు ఇద్దరు కలిసి విశ్వంను దారుణంగా కొట్టేస్తారు.. వాళ్ళ మామ ఆపడంతో ఇద్దరు ఆగుతారు. మా నాన్న జోలికొస్తే ఇంకొకసారి కొట్టడం కాదు చంపేస్తామని ధీరజ్ విశ్వం కు వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ విశ్వం బయటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వాళ్ళ నాన్నతో అత్తతో చెప్తాడు. దానికి సీరియస్ అయినా సేన నా కొడుకుని ఇలా కొడతారా ముందు ఆ రామరాజుని నేనే చంపేస్తానని అంటాడు.. అంత ఆవేశం పనికిరాదు రా ఆ రామ్ రాజ్ కి బుద్ధ వచ్చేలా చేయాలి ముందు ఆ చందు గాని ఏదో ఒకటి చేయాలి అని భద్ర ప్లాన్ వేస్తుంది. విశ్వంను పోలీసులకి చెప్పాలని భద్ర చెబుతుంది. నేను చెప్పింది అర్థమైందా రా నువ్వు అలానే వెళ్లి కంప్లైంట్ ఇవ్వు అని అనగానే విశ్వం అలాగే అత్త అని వెళ్ళిపోతాడు. పోలీసులు చందును అరెస్ట్ చేస్తారు. అటు చందుకు సంబంధం ఖాయమైందని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. కొడుకును అరెస్ట్ చేసిన విషయం తెలుసుకొని షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి ధీరజ్ని క్షమించి దగ్గరికి తీసుకోండి అని రామరాజుకి చెప్తుంది. తన చిన్న కొడుకు గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది అంతలోకే తన తమ్ముడు వచ్చి చందు ని పోలీసులు అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని బయట పెడతాడు. అసలు ఏం జరిగింది రా చందు ని పోలీసులు అరెస్ట్ చేయడమేంటి పెద్దోడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని రామరాజు అడుగుతాడు. విశ్వం నిన్ను కొట్టడంతో ధీరజువాని కొట్టడానికి వెళ్ళాడు. అయితే నేను పెద్దోడికి ఫోన్ చేశాను ఇంటికి రమ్మని వాడి కంట్రోల్ చేయమని వాడు వచ్చి వాళ్ళు విశ్వం రెచ్చగొట్టడంతో వాని ఇద్దరు కలిసి కొట్టారు అయితే ధీరజ్ని కాకుండా చందు పై పోలీస్ కేసు పెట్టారు అని చెప్పగానే రామరాజు టెన్షన్ పడతాడు.
చూసావా నీ చిన్న కొడుకు చాలా మంచోడు అన్నావు కదా ఇది నీ చిన్న కొడుకు ఎవరు వాడు చేసిన పనికి ఇప్పుడు నా పెద్దోడు బలయ్యాడు అనేసి బాధపడుతూ వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు అది పెద్దోడు ఎందుకురా నువ్వు ఇలా చేశావు నా పెద్దోడు ఏం తప్పు చేశాడు ఎస్ఐ గారు అని అనగానే బుజ్జమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక భద్రావతి భాగ్యం కు ఫోన్ చేస్తుంది.
ఈ పెళ్లి చేయొద్దు నేను ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేయడానికి రెడీ అయ్యావు కదా ఇప్పుడు నీకు కాబోయే అల్లుడు ఎక్కడున్నారు వారి కుటుంబం ఎక్కడుందో తెలుసా అనేసి అంటుంది ఏమైందండీ ఏం జరిగింది అని భాగ్యం అడిగితే వాళ్లంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అవ్వడంతో నీకు కాబోయే అల్లుడు జైల్లో పూసలు లెక్క పెడుతున్నాడు అని చెప్పగానే భాగ్యం షాక్ అవుతుంది. ఈ విషయం గురించి ఏంటో తెలుసుకోవాలి అమ్మడు నువ్వు తొందరపడి ఎమోషనల్ అయ్యి అల్లుడి మీద జాలి చూపించకు నేను చూసుకుంటాను అని అంటుంది..
ఇక రామరాజు ఎస్ఐ ని అడుగుతాడు. నీ కొడుకు మీద విశ్వం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు మారినాయిదాలతో తనని దాడి చేయబోయారు అని అతని పెట్టారు అని అనగానే మా కొడుకు ఏంటి మర్డర్ చేయడం ఏంటి వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారు మా లాయర్ గారు వచ్చి మాట్లాడతారు అని అంటాడు. అప్పుడే భాగ్యములో వచ్చి ఏంటనే గారు ఇది మీ గురించి మంచి కుటుంబం అని మీరు నిన్న చెప్తే నేను అన్ని పక్కన పెట్టేసి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు జైల్లో ఉన్న అల్లుడికి ఎలా పెళ్లి చేయమంటారు అని అంటుంది.
చెల్లెమ్మ నువ్వేం బాధపడకు చెల్లెమ్మ మా లాయర్ గారు వస్తూనే నా కొడుకుని బయటికి తీసుకుని వస్తాడు. పెళ్లి జరుగుతుంది నువ్వేం బాధపడకు అని భాగ్యంతో రామరాజు అంటాడు. ఇక లాయర్ రాగానే ఎస్సైని అడుగుతాడు ఇది అటెండ్ మర్డర్ కేసు సార్ ఇప్పుడు డైలీ ఇవ్వడం కోసం ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని అంటాడు. ఇక ధీరసొచ్చి ఇదంతా చేసింది నేను మా అన్నయ్య మీద కేసు ఎందుకు పెట్టారు అని అడుగుతాడు. పోలీసులు మాత్రం ఏదైనా అంటే బయట మాట్లాడుకోండి ఇక్కడ రచ్చ చేయకండి అనేసి బయటికి గెంటేస్తారు.
భాగ్యం పోలీస్ స్టేషన్లో ఉన్న అతనికి నా కూతురు ఇచ్చి ఎలా పెళ్లి చేయమంటారు అన్నయ్యగారు ఒకసారి ఆలోచించండి మీరే మర్డర్ కేస్ అంటే ఇక జైలు నుంచి బయటికి రాడు నా కూతుర్ని ఇచ్చి చేసేది లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన పెద్ద కొడుకుకి పెళ్లి కాదని రామరాజు టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సాగర్ వాళ్లు మీరు ఎల్లండి నాన్న నేను మామ ఇక్కడ ఉంటాం అనేసి అంటారు వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ ని కొడతాడు రామ రాజు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..