BigTV English
Advertisement

Prabhas:- ప్రభాస్ ప్రెస్‌మీట్స్.. ఆ 10 రోజులు అడిగిన వాటికన్నింటికీ ఆన్సర్స్

Prabhas:- ప్రభాస్ ప్రెస్‌మీట్స్.. ఆ 10 రోజులు అడిగిన వాటికన్నింటికీ ఆన్సర్స్


Prabhas:- రాధేశ్యామ్ వచ్చి చాలాకాలం అయింది. హీరో ప్రభాస్ తెరమీద కనిపించకపోవడంతో సంవత్సరాలు అయినట్టు కనిపిస్తోంది. బాహుబలి తరువాత చేసిన వరుస పాన్ ఇండియా సినిమాలు హిట్ కాకపోవడంతో.. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నాడు. ఎంత ప్లాన్ చేసుకున్నప్పటికీ.. ఆదిపురుష్ విషయంలో తన కెరీర్‌లోనే ఎదుర్కోనన్ని విమర్శలు ఫేస్ చేశాడు. నిజానికి ఈ విమర్శలు దర్శకుడు ఓం రౌత్‌కు తప్ప ప్రభాస్‌కు కాదు. కాని, ఎఫెక్ట్ పడేది మాత్రం అల్టిమేట్‌గా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపైనే. ఇప్పుడు ఆ విమర్శలు చెరిపేసేందుకు.. కొన్ని కరెక్షన్స్ చేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

జూన్ 16వ తేదీన ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పబ్లిసిటీ క్యాంపైన్ కూడా నడపబోతున్నారు. ఈ క్యాంపైన్‌కు ప్రభాస్ పది రోజుల పాటు టైం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ పది రోజుల్లోనే ఎలాంటి ప్రమోషన్ చేయడానికైనా రెడీ అన్నాడట ప్రభాస్. ఇందులో భాగంగా ప్రెస్ మీట్స్ కూడా ఉండబోతున్నాయి. ఆదిపురుష్ గురించి ఎన్ని విమర్శలు వచ్చాయో చెప్పక్కర్లేదు. వాటన్నింటికీ ప్రభాస్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాడన్నదే మెయిన్.


ఆదిపురుష్ కోసం కొన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. రాముడి జన్మస్థలం ఆయోధ్యతో పాటు వారణాసిలో పెద్ద ఎత్తున ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పబ్లిసిటీ చేయబోతున్నారు. జూన్ 1న ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. వీలైతే.. భద్రాచలం కూడా రావాలనుకుంటున్నారు. ప్రమోషన్‌కి ఇంకా చాలా సమయం ఉండడంతో.. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆదిపురుష్ కోసం ఈ నెలలోనే 10 రోజులు షెడ్యూల్ ఇస్తున్న ప్రభాస్.. రిలీజ్‌కు వారం ముందు కూడా డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రిలీజ్‌కు ముందు వారంలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు, అభిమానులతో ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలకు ప్లాన్ చేశాడు. ఇప్పటికే, ట్రైలర్, గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఆదిపురుష్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. అభిమానుల ఆశలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశామని సినిమా యూనిట్ కూడా చెబుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో, ఎన్ని సంచలనాలు క్రియేట్ చేయబోతోందో, ఎన్ని విమర్శలు ఎదుర్కోబోతోందో చూడాలి. 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×