BigTV English

Surender Reddy:- సురేందర్ రెడ్డికి బన్నీ బాసట.. నెక్ట్స్ ఫిల్మ్ రెడీ

Surender Reddy:- సురేందర్ రెడ్డికి బన్నీ బాసట.. నెక్ట్స్ ఫిల్మ్ రెడీ


Surender Reddy:- ఏజెంట్ సినిమా తరువాత సురేందర్ రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నది డైరెక్టర్ సురేందర్ రెడ్డినే. ఈ మధ్యే నిర్మాత అనిల్ సుంకర కూడా రెస్పాండ్ అయ్యారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోకుండా షూటింగ్‌కు వెళ్లడం తప్పేనని ఒప్పుకున్నాడు. అసలు స్క్రిప్ట్ విషయాలు చూసుకోవాల్సిందే సురేందర్ రెడ్డి. కాని, ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా లొకేషన్లను ముందే స్పాట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ షూటింగ్, ఎంత మందితో షూటింగ్, ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేయాలన్నది డైరెక్టరే చూసుకోవాలి. కాని, ఈ ప్లానింగ్ మొత్తం మిస్ అయింది. దీనికి కారణం దర్శకుడు సురేందర్ రెడ్డినే.

ప్లానింగ్ లేని సురేందర్ రెడ్డిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఇవన్నీ చూస్తే.. ఇక ఇప్పట్లో సురేందర్ రెడ్డితో కలిసి సినిమా చేసే వారే ఉండరు. అలాంటిది.. ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాడు అల్లు అర్జున్. రేసుగుర్రం సినిమాతో అల్లు అర్జున్‌కు సాలిడ్ హిట్ ఇచ్చాడు సురేందర్. దాంతో అప్పట్లోనే మరో సినిమా చేసేందుకు ప్రామిస్ చేశాడు. అనుకున్నట్టుగానే సురేందర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయినా సరే.. బన్నీ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నిజానికి ఆచార్య, లైగర్ వంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు.. అంతకు ముందు ఆ డైరెక్టర్లతో కమిట్ అయిన హీరోలు వెనకడుగు వేశారు. సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నారు. కాని, అల్లు అర్జున్ మాత్రం సురేందర్ రెడ్డికి కమిట్‌మెంట్ ఇస్తున్నాడు.


అల్లు-సురేందర్ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లోకి వెళ్లి.. ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ… బన్నీ తెలుగు మూలాలు, తెలుగు డైరెక్టర్లను పక్కన పెట్టదలచుకోలేదు. కేవలం సురేందర్ రెడ్డితోనే కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనూ టాక్స్ నడుస్తున్నాయి. మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ నుంచి అల్లు అర్జున్‌కు ఆఫర్ వచ్చిందంటున్నారు. ఈ చర్చలు ఎంత వరకు నడిచాయన్నది అధికారికంగా కన్ఫార్మ్ కాలేదు. మొత్తానికి, సురేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా బన్నీ చాలా పెద్ద ధైర్యమే చేస్తున్నాడనుకోవాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×