E-Paper
Advertisement

Salaar Part 2 : అంచనాలకు మించి ఉండబోతున్న సలార్ 2 ..

Salaar Part 2 : అంచనాలకు మించి ఉండబోతున్న సలార్ 2 ..
Advertisement
salaar part 2

Salaar Part 2 : టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సలార్ గురించి చర్చలు వినిపిస్తున్నాయి. డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ను ఆన్ స్క్రీన్ ఎంత డైనమిక్ గా చూడాలి అని అనుకున్నారు ప్రశాంత్ నీల్ అంతకంటే డైనమిక్ గా చూపించేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి తగిన ఇమేజ్ ఉండే పాత్ర చేశాడు అని అందరూ అంటున్నారు. ఎంతో గ్రిప్పింగా సాగే కథ ,అంతకంటే అద్భుతంగా ఉన్న ఫైటింగ్స్ సన్నివేశాలతో సలార్ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

ఈ మూవీని అందరూ ప్రశంసిస్తున్న మాట నిజమే కానీ అక్కడక్కడ చిత్రంపై కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయి. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ సరిగా చూపించలేదని.. ఇద్దరు మిత్రుల మధ్య స్నేహం వైరంగా ఎలా మారింది అన్న విషయాన్ని మూవీలో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని కొందరు భావిస్తున్నారు. అలాగే స్టొరీ ని కూడా కాస్త గందరగోళంగా నడిపించారు అన్న వాదన వినిపిస్తోంది. చాలా విషయాలు కన్ఫ్యూజింగ్ గా ఉండడమే కాకుండా అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావడం లేదు.. ఇలా మూవీపై ఎన్నో కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

అయితే కంగారు పడాల్సిన పనేమీ లేదు ఎందుకంటే ఈ కన్ఫ్యూషన్ అంతా రాబోయే ఎక్సైట్మెంట్ కి ముందు ట్రీట్ లాగా అంటున్నారు సినీ విశ్లేషకులు. సలార్ పార్ట్ 1 లో హీరో పాత్ర యొక్క అన్ని కోణాలను పూర్తిస్థాయిలో చూపించలేదు.. ఎందుకంటే అసలు కథ మొదలయ్యేది పార్ట్ 2 లోనే అట. మొదటి భాగంలో పృధ్విరాజ్ తో ప్రభాస్ వైరం గురించి పైపైన అలా మాటలు రూపంలో చెప్పారే తప్ప తెరపై పెద్దగా చూపించలేదు. ఇలా చేయడం వల్ల ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అన్న ఆసక్తి ఆడియన్స్ లో అలాగే మెయింటైన్ అవుతుంది.

వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఈ క్వశ్చన్ కొన్ని సంవత్సరాలు మనల్ని వెంటాడింది గుర్తుందా.. దాని ఫలితం బాహుబలి 2 కి విపరీతమైన హైప్ రావడం. ప్రశాంత్ నీల్ సేమ్ స్ట్రాటజీని సలార్ విషయంలో ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి భాగంలో పైపైన కనిపించిన జగపతిబాబు పాత్ర రెండవ భాగంలో చాలా హైలైట్ అయ్యే అవకాశం ఉందట. నెక్స్ట్ పార్ట్ లో ప్రభాస్ పాత్రకు సంబంధించి సరికొత్త కోణాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. కథ మొత్తం అతని చుట్టే తిరగడంతో పాటు ఇంతకు మించి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×