BigTV English

Gopichand Tweet  : సలార్ తుఫాను ఇప్పుడే ఆగదు.. గోపీచంద్ వైరల్ ట్వీట్..

Gopichand Tweet  : సలార్ తుఫాను ఇప్పుడే ఆగదు.. గోపీచంద్ వైరల్ ట్వీట్..
Gopichand Tweet 

Gopichand Tweet :   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కామన్ మెన్ లో ఎంతమంది అభిమానులు వున్నారో సెలబ్రిటీల్లో కూడా అంతేమంది అభిమానులుగా ఉన్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన వ్యక్తిగా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. విడుదలైన సలార్ చిత్రం సక్సెస్ను ప్రభాస్ కంటే ఎక్కువగా అతని అభిమానులు మిగిలిన సెలబ్రిటీలు జరుపుకుంటున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. భారీ అంచనాల మధ్య సలార్ పార్ట్ 1 వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా తర్వాత రాబోయే పార్ట్ 2 దీనికి మించి ఉంటుంది అన్న టాక్ వినిపిస్తోంది.


ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సవం సృష్టిస్తోంది. ఇక ఇందులో ప్రభాస్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సలార్ గురించి ఎక్కడ చూసినా హాట్ డిస్కషన్ నడుస్తోంది. పలువురు సెలబ్రిటీలు సలార్ సక్సెస్ను పురస్కరించుకొని ప్రభాస్ ను మెచ్చుకుంటున్నారు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో గోపీచంద్ సలార్ మూవీ గురించి పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి ఒక మ్యాజిక్ బ్లాస్ట్ లాంటి మూవీ అందించినందుకు ప్రశాంత్ నీల్ కు గోపీచంద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఏ కాకుండా తను కూడా ప్రభాస్ ని ఏ రకంగా స్క్రీన్ పై చూడాలి అనుకున్నారు ఈ మూవీలో ప్రభాస్ ఆ రకంగా కనిపించాడు అని గోపీచంద్ తెలిపారు. సలార్ మూవీలో భాగమైన ప్రతి ఒక్కరికి గోపీచంద్ కంగ్రాజులేషన్స్ తెలుపడంతో పాటు ఈ భీకరమైన తుఫాను ఇప్పుడిప్పుడే ఆగదు.. అని అన్నారు. సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి అంత సులువుగా ఆగదు అని గోపీచంద్ చెప్పకనే చెప్పారు. ప్రభాస్ కు సంబంధించి ఏ న్యూస్ అయినా వైరల్ చేస్తున్న అతని అభిమానులు ఈ ట్వీట్ ని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×