Pooja Hegde Joins Surya Film: కోలీవుడ్‌లో హిట్ కోసం పరితపిస్తోంది హీరోయిన్ పూజాహెగ్డే. కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తోంది. ఈసారి సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. దీనికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ రెండు నుంచి షూటింగ్ మొదలుకానుంది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో టాలీవుడ్‌లో చాలామంది అభిమానులను పోగేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించింది. బాక్సాఫీసు వద్ద భారీ హిట్స్ కొట్టింది. కెరీర్‌లో ఇప్పటివరకు 20 సినిమాలు చేసింది. అందులో ఆరు సినిమాలు హిందీలో ఉంటే రెండే రెండు తమిళంలో చేసింది. ఆ రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి.
ముగముడి మూవీ కోలీవుడ్ ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. ఆ ఫిల్మ్ ఆశించిన విజయం సాధించలేదు. ఫస్ట్ మూవీ ప్లాప్ కావడంతో కెరీర్ ఎలా ఉంటుందోనని మొదట్లో భయపడింది. ఈ బ్యూటీని అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. రెండేళ్ల కిందట విజయ్‌తో నటించిన బీస్ట్ సినిమా కూడా నిరాశ పరిచింది. అప్పటి నుంచి కోలీవుడ్ జోలికి వెళ్లలేదు. కాకపోతే స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వస్తే చేయాలని భావించింది.
Also Read: వెయిట్ చేయండి డార్లింగ్స్.. మంచి న్యూస్ చెప్తానన్న ప్రభాస్.. పెళ్లి అప్డేటా?
ఇదే సమయంలో పూజాను కలిసిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఓ స్టోరీ లైన్ వినిపించాడు. కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఓకే చెప్పింది. సూర్య హీరోగా చేస్తున్నాడని చెప్పడంతో వెంటనే ఓకే చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో జూన్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు డైరెక్టర్ సుబ్బరాజ్.
40 రోజులపాటు సింగల్ షెడ్యూల్ అండమాన్‌లో ప్లాన్ చేశారు. దాని తర్వాత ఊటీ, ఏపీలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నట్లు కోలీవుడ్ టాక్. మోలీవుడ్ నటుడు జోజు జార్జ్ ఇందులో కీలకపాత్ర చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది హీరోయన్లను సుబ్బరాజ్ సంప్రదించాడు. కానీ, ఏదీ సెట్ కాలేదు. చివరకు బుట్టబొమ్మతో లైన్ క్లియర్ అయ్యింది. మరి సూర్య-పూజాహెగ్డే కాంబో స్క్రీన్‌పై ఏ విధంగా ఉంటుందో చూడాలి.