E-Paper
Advertisement

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Prabhas Spirit Movie: దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి చేసిన ‘బాహుబలి’తోనే ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. అందుకే అప్పటినుండి తన ప్రతీ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఫీలవుతారని మేకర్స్‌కు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అందుకే అప్పటినుండి ప్రభాస్ నటిస్తున్న ప్రతీ సినిమా భారీ బడ్జెట్‌తో, ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్నాయి. అలాంటిది ఇక ప్రభాస్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా తెరకెక్కే చిత్రం ఇంక ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఆడియన్స్‌లో అప్పుడే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలాంటి ‘స్పిరిట్’ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

భారీగా అంచనాలు

తన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయే 25వ చిత్రాన్ని రెండేళ్ల క్రితమే అనౌన్స్ చేశాడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు అని, దానికి ‘స్పిరిట్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. అప్పటినుండి ఇప్పటివరకు ఈ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవైపు ప్రభాస్ కూడా తన బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్‌ను పూర్తిచేస్తూ వస్తున్నాడు. దీంతో ప్రభాస్ కాల్ షీట్స్ దొరకడం కష్టమనే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌కు ప్రయాణమయ్యి ‘యానిమల్’ అనే మూవీని తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలు అన్నీ ‘స్పిరిట్’పైనే ఉన్నాయి.

Also Read: దేవరను భయపెడుతున్న ఆ సెంటిమెంట్.. ఆ ఒక్కటే ఎన్టీఆర్ కు మైనస్..

ధీటైన విలన్స్

‘స్పిరిట్’లో విలన్‌గా ఎవరు నటిస్తున్నారు అనేదానిపై గత కొన్నిరోజులుగా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో విలన్‌గా ఒకరు కాదని, ఒక బాలీవుడ్ స్టార్ కపుల్‌ను సందీప్ రెడ్డి వంగా రంగంలోకి దించనున్నాడని సమాచారం. వారెవరో కాదు.. బాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ కపుల్స్‌లో ఒకరు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి తనతో పాటు తన భార్య కరీనా కూడా ప్రభాస్‌ను ఎదిరించే ధీటైన విలన్స్‌గా కనిపించనున్నారనే వార్త ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

సౌత్‌పై ఫోకస్

‘ఆదిపురుష్’తోనే మొదటిసారిగా సౌత్ ప్రేక్షకులను పలకరించాడు సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’లో కూడా తనే విలన్‌గా నటించాడు. ఇలా సైఫ్ అలీ ఖాన్ ఫోకస్ అంతా ప్రస్తుతం సౌత్‌పైనే ఉందని తెలుస్తోంది. కానీ తన భార్య కరీనా కపూర్ మాత్రం ఇప్పటికి ఒక్కసారి కూడా సౌత్ స్క్రీన్ పై కనిపించలేదు. పైగా బాలీవుడ్‌లో కూడా తన సినిమాల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే నటించడానికి ఇష్టపడుతోంది. అలాంటి ఈ క్రేజీ బాలీవుడ్ కపుల్‌ను తన ‘స్పిరిట్’లో నటించడానికి సందీప్ రెడ్డి వంగా ఒప్పించాడా లేదా ఇవన్నీ కేవలం రూమర్సేనా అని తెలియడానికి మరికాస్త సమయం పడుతుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×