E-Paper
Advertisement

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

యువత భవితకే స్కిల్ వర్సిటీ

– గొప్ప సంకల్పం.. కలిసి రండి
– ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు
– మరింత కార్పస్‌ఫండ్‌ ఏర్పాటుకు యోచన
– పరిశ్రమ పెద్దలు కలిసి రావాలని విజ్ఞప్తి
– ఈ ఏడాది నుంచే 6 కోర్సులు ప్రారంభం
– స్కిల్ వర్సిటీ బోర్ట్ మీట్‌లో సీఎం రేవంత్

Advertisement

CM Revanth Reddy: మన రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. గురువారం తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డు సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. వర్సిటీ విధి విధానాలు, కరికులమ్‌ను పరిశ్రమలతో అనుసంధానం చేయడం తదితర అంశాలపై వర్సిటీ బోర్టు సభ్యులతో ముఖ్యమంత్రి చర్చించారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి సంబంధించి కీలక విషయాలను అధికారులు పారిశ్రామిక వేత్తలకు ప్రజంటేషన్ రూపంలో తెలిపారు. ఈ భేటీలో వర్సిటీ బోర్డు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, కో చైర్మన్ శ్రీనివాస సీ రాజు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, హెరిటేజ్ గ్రూప్ తరపున నారా బ్రాహ్మణి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

వంద కోట్ల కార్పస్..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించటం ద్వారా వారికి మెరుగైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే స్కిల్ వర్సిటీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు కేటాయిస్తామని, దీని పూర్తిస్థాయి నిర్వహణకు అవసరమైన కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ఎవరికి తోచిన విధంగా సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ ఏడాది యూనివర్సిటీలో ప్రారంభించబోయే కోర్సుల వివరాలను.. అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు.

Advertisement

Also Read: Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

మొత్తం 20 కోర్సులు..
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల దగ్గర కేటాయించిన 57 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఇంకా సమయం పట్టనుంది. కాబట్టి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా లేక న్యాక్ లేదా నిథమ్‌లో స్కిల్ యూనివర్సిటీని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ఈ స్కిల్ వర్సిటీలో మొత్తం 20 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికి.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది 6 కోర్సులను ప్రారంభిస్తామని సీఎస్ వెల్లడించారు.

సీఎం చొరవ చూసే సరేనన్నా..
స్కిల్ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన గొప్పదని ప్రశంసించారు. రేవంత్‌ విజన్‌ ఉన్న నాయకుడిని ఆనంద్‌ మహీంద్ర ప్రశంసించారు. అందుకే స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానని ఆనంద్ మహీంద్రా వివరించారు.

Related News

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

Big Stories

Advertisement
×