
Prabhas Sukumar:ప్రభాస్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రెడీ అవుతోందని, దాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తుందనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే అందులో నిజం లేదని అనౌన్స్ చేసేశారు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మేకర్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ అని చెబుతూనే, ఈ విషయాన్ని డిక్లేర్ చేసేశారు. ఈ ఏడాది మా సంస్థలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇటీవల మా సంస్థ పేరును ముడిపెడుతూ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. మా నుంచి అలాంటివేమైనా ఉంటే మేం అనౌన్స్ చేస్తాం. అంతేగానీ, ముందు నుంచీ మీరు అలాంటి హోప్స్ ఏమీ పెట్టుకోవద్దు. అసలు అలాంటివేం మాదగ్గర జరగడం లేదు
అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
నిజానికి కూడా ప్రభాస్ – సుకుమార్ సినిమా ఇప్పట్లో కుదిరే ఛాన్సులు తక్కువే. ఇప్పుడు పుష్ప2 పనుల్లో సుకుమార్ బిజీ. ఆ తర్వాత పుష్ప3 ఉంటుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ సినిమా చేస్తే చూడాలని వెయిటింగ్ అంటూ ఊరిస్తున్నారు రాజమౌళి. మరోవైపు సుకుమార్ ఎప్పుడెప్పుడు కాల్షీట్ అడుగుతారా? ఇద్దామా అని విజయ్ దేవరకొండ వెయిటింగ్. ఇన్నిటి మధ్య అసలు ప్రభాస్ సినిమా ఎప్పుడు జరగాలి? ఎలా జరగాలి? పోనీ, అటు ప్రభాస్ వైపు నుంచి ఆలోచించినా ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
సలార్ 85 శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఆదిపురుష్ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. దాని తర్వాత మారుతి సినిమా సెట్స్ మీద ఉంది. అటు ప్రాజెక్ట్ కె కోసం ఇంకా బోలెడన్ని కాల్షీట్లు కావాలి. మరి ఇన్నిటిని కంప్లీట్ చేసేసరికి ప్రభాస్‌కి ఎంత టైమ్ పడుతుందో ఊహించారా? .. కాబట్టి, అటు ప్రభాస్‌కి గానీ, ఇటు సుకుమార్‌కి గానీ ఇమీడియేట్‌గా అయితే ఒకే సెట్లో కనిపించే ఛాన్సులు లేవన్నమాట. అందుకే ముందుగా క్లారిటీ ఇచ్చేసింది ప్రొడక్షన్ హౌస్.