BigTV English

Spirit: మూడు గెటప్స్ లో ప్రభాస్ , సందీప్ ప్లానింగ్ అదుర్స్

Spirit: మూడు గెటప్స్ లో ప్రభాస్ , సందీప్ ప్లానింగ్ అదుర్స్

Spirit : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అందరితో అనిపించుకున్నాడు సందీప్. ఇదే సినిమాని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి ప్రశంసలు పొందుకున్నాడు. అయితే ప్రశంసలు కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువగా విమర్శలు వచ్చాయి. చాలామంది సినిమా క్రిటిక్స్ ఇది ఒక వైలెంట్ ఫిలిం అంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా సందీప్ రెడ్డి వంగకి విపరీతమైన కోపాన్ని తీసుకొచ్చాయి. అందుకే ఒక ఇంటర్వ్యూలో అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపించబోతున్నాను అంటూ తెలిపాడు.


సందీప్ బాలీవుడ్ లో చేసిన రెండవ సినిమా అనిమల్.  రన్బీర్ కపూర్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా కూడా కొద్దిపాటి విమర్శలు వచ్చాయి. కానీ ఇవేవీ కూడా సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించ లేకపోయాయి. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ అద్భుతంగా నటించాడు. రణబీర్ తప్ప ఈ సినిమాని మరో హీరో చేయలేడు అనే రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చాడు రన్బీర్. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ చాలా గెటప్స్ లో కనిపిస్తాడు. ఒకసారి లాంగ్ హెయిర్ తో కనిపిస్తే మరోసారి షార్ట్ హెయిర్ తో కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ప్రభాస్ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : Prabhas: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్


సందీప్ రెడ్డి వంగ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చాలా ఇంటెన్స్ తో మాట్లాడుతాడు. అలానే సందీప్ సినిమాలో హీరోలు కూడా అదే మాదిరిగా కనిపిస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ మూడు గెటప్స్ లో కనిపిస్తారు అని తెలియగానే క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ మీద సందీప్ కి ఎంత పట్టు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తి గీతాన్ని కూడా ఎమోషనల్ సాంగ్ గా మార్చి తన సినిమాలో పెట్టగలరు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలకపాత్రను పోషిస్తుంది. ఇప్పటివరకు సందీప్ చేసిన మూడు సినిమాలుకు కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇక స్పిరిట్ సినిమాకి సంబంధించి కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించబోతున్నట్లు తెలుస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×