BigTV English

Prabhas: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Prabhas: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Prabhas: రీసెంట్ టైమ్స్ లో రెండేళ్లకు ఒక సినిమా ఇప్పుడున్న స్టార్ హీరోలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఒక హీరో సినిమా ఏడాదిలో మూడు నాలుగు రిలీజ్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు ఒకే ఏడాదిలో ఆరు సినిమాలకు పైగా రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాత్రి పగలు కష్టపడుతూ సినిమాలు చేసేవాళ్ళు అప్పుడు ఉండే స్టార్ హీరోలు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి సరికొత్త టెక్నాలజీని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ కి ఉంది అని చెప్పాలి. ప్రతిసారి ఏదో కొత్తగా చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారని కూడా చెప్పాలి. ఫస్ట్ జేమ్స్ బాండ్ ఫిలిం కూడా చేసింది సూపర్ స్టార్ కృష్ణ.


ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ఒక ప్రాజెక్టు కోసం కనీసం రెండు మూడు సంవత్సరాలు టైం కేటాయిస్తూ వస్తున్నారు. ఇక ప్రభాస్ కూడా బాహుబలి సినిమా కోసం ఐదేళ్లు తన టైం కేటాయించాడు. అలా చేసినందుకు తగిన ఫలితం ప్రభాస్ కు దక్కింది అని చెప్పాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా ప్రపంచ చూపు తెలుగు సినిమా పైన పడింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కెరియర్లో వరుస సినిమాలు లైన్లో పెట్టి ముందుకు వెళ్తున్నాడు.

Also Read : Trolls On Vishwak Sen : గజినీ చూసి గుండు కొట్టించున్న పర్లేదు అన్న, ఉప్పెన చూసి ఆ పని చెయ్యకండి


ప్రభాస్ కెరియర్ లో ప్రస్తుతం చేయాల్సిన సినిమాలు దాదాపు 6 పైగా ఉన్నాయి. రీసెంట్ గా కల్కి సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2 సినిమాను చేయనున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ సలార్ 2 సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఒక సినిమా, అలానే ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. దాదాపు ఈ ప్రాజెక్టులు కూడా ఫిక్స్ అయిపోయాయి అనుకోవచ్చు. ప్రభాస్ బాహుబలి సినిమా కోసం అంత టైం కేటాయించినా కూడా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి దాదాపు ఒక 10 ఏళ్లు వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రభాస్ కెరియర్ లో ఇప్పటివరకు రెండు 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకొస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×