దమ్ములేక కేసులు పెడుతున్నారు
అక్రమ అరెస్టులపై లక్ష్మీపార్వతి ఫైర్
ఏపీలో నీచరాజకీయాలు
కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
బాబు, రామోజీరావులు కలిసి కుట్రలు
దివంగత ఎన్టీఆర్ పై అభ్యంతకర కార్టూన్లు
ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ?
బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు
దోచుకోవడమే బాబుకు తెలుసు
మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారు
అమరావతి, స్వేచ్ఛ:
Lakshmi Parvati: జగన్ ను ఎదుర్కునే దమ్ము లేక కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. శుక్రవారం స్థానిక తాడేపల్లి పార్టీ కార్యలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఏపీలో నీచ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. కూటమి సర్కార్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని అన్నారు. డైవర్షన్ రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది పేరని అన్నారు. పాలనలోని లోపాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని..ఇదెక్కడి ప్రజాస్వామ్యమని అన్నారు.
Also Read: Sri Reddy: మీకు దండం పెడతా.. సారీ.. సారీ.. నన్ను వదిలేయండి మహాప్రభో.. శ్రీరెడ్డి కన్నీళ్లు
నాడు కుట్రలు
నాడు బాబు, రామోజీరావులు కలిసి ఎన్ని కుట్రలు చేశారో జనమందరికీ తెలుసన్నారు. ఈనాడు కార్టూన్స్ లో ఎన్టీఆర్ ని పిచ్చివాడిగా చిత్రీకరించారని..తనని అది ఎంతగానో బాధించిందని అన్నారు. దివంగత ఎన్టీఆర్ ని అగౌరవిస్తూ ఈనాడులో ప్రచురితమైన కార్టూన్లను మీడియాకు ప్రదర్శించారు. ప్రశ్నిస్తానని గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? ప్రజలకు మొహం చూపలేక పారిపోయాడని అన్నారు. చంద్రబాబుకు దోచుకోవడమే తెలుసని అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.