BigTV English

Prabhas: వామ్మో! ప్ర‌భాస్‌కి జీరో రెమ్యూన‌రేష‌న్

Prabhas: వామ్మో! ప్ర‌భాస్‌కి జీరో రెమ్యూన‌రేష‌న్

Prabhas:బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల గురించి కొత్త‌గా చెప్పుకోన‌క్క‌ర్లేదు. భారీ బ‌డ్జెట్ చిత్రాలు..స్టార్ డైరెక్ట‌ర్స్‌తోనే ఆయ‌న సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న సినిమాల్లో స‌లార్ , ప్రాజెక్ట్ K చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాకుండా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను చేస్తున్నారు మ‌న డార్లింగ్ ప్ర‌భాస్‌. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. అయిన‌ప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం చ‌క చ‌కా జ‌రిగిపోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


స‌లార్‌, ప్రాజెక్ట్ K చిత్రాల‌కు వంద కోట్ల‌కు పైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న ప్ర‌భాస్.. మారుతి సినిమాకు ఎంత తీసుకున్నారోన‌ని అంద‌రూ అన‌కుంటున్నారు. అయితే సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రానికి ప్ర‌భాస్ ఎలాంటి డ‌బ్బులు తీసుకోవ‌టం లేదట‌. సినిమా విడుద‌లైన త‌ర్వాత జ‌రిగే మార్క‌ట్ నుంచి కొంత మొత్తం, లాభాల్లో నుంచి కాస్త షేర్ ఇస్తే చాలని డార్లింగ్ ముందుగానే కండీష‌న్ పెట్టార‌ట‌. దానికి నిర్మాత కూడా ఓకే చెప్పిన త‌ర్వాతే ప్ర‌భాస్ డేట్స్ కేటాయించార‌ని స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ ట‌చ్ చేయ‌ని హార‌ర్ జోన‌ర్‌లో మారుతి సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌ల‌తో పాటు రిద్ది కుమార్ కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. స‌లార్ సినిమా సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాదిలోనే మారుతి ద‌ర్వ‌క‌త్వంలోనూ సినిమా రిలీజ్ అవుతుంద‌ని టాక్.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×