BigTV English

The Raja Saab: ఈ ఫోటోలో తమన్ పక్కన ఉన్నది ప్రభాసా ?

The Raja Saab: ఈ ఫోటోలో తమన్ పక్కన ఉన్నది ప్రభాసా ?

The Raja Saab: రీసెంట్ టైమ్స్ లో ట్రోలింగ్ అనేది మరీ ఎక్కువ అయిపోయింది. చాలామంది లిమిట్ దాటి కామెంట్ చేయడం మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాన్ వార్స్ వలన కొంతమంది హీరోల పైన ఈ ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అంటే చాలా హెల్దిగా జరిగేవి. ఒక హీరో సినిమా రిలీజ్ అయితే వేరే హీరో అభిమానులు కూడా థియేటర్కు తీసుకెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒకవేళ ఈ సినిమా పోతే వేరే హీరో ఫ్యాన్స్ వీళ్ళని కామెంట్ చేసేవాళ్ళు. అది ఇంకో సినిమా వచ్చినంత వరకు అప్పుడప్పుడు హెల్తీగా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కలెక్షన్స్ తో, ఫేక్ ఇంట్రెస్టింగ్ రేట్స్ తో సోషల్ మీడియా వేదికగా చాలామంది ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ప్రత్యక్షంగా కలుసుకుని మరి గొడవలు దిగుతున్నారు.


వ్యక్తిగతంగా ట్రోలింగ్ 

ఒక హీరోకు సంబంధించి తన ఎంచుకునే పాత్రలు, తన యాక్టింగ్ స్కిల్స్ వీటిని బట్టి ఆ హీరోను కామెంట్ చేయడం కొంతవరకు ఓకే అనిపిస్తుంది. కానీ కొంతమంది మాత్రం మరీ పర్సనల్ గా వెళ్లిపోయి బాడీ సేమింగ్ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం ఏ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉందో ఆ సినిమా హీరోని కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ నటించిన రాజసాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో టీజర్ 16 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ వర్క్ కి సంబంధించిన ఒక ఫోటోను తమన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తమన్ పక్కన ఒక టెక్నీషియన్ కూర్చుని ఉన్నారు. అయితే ఆ ఫోటోను షేర్ చేసి ప్రభాస్ ఏంటి ఇలా అయిపోయాడు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు.


చాలా కొత్తగా ఉన్నాడు 

వాస్తవానికి రాజా సాబ్ సెట్స్ లో ఒక ఫోటో విడుదలైంది. ఆ ఫోటోలు ప్రభాస్ మారుతి తమన్ కనిపిస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ చేసిన అన్ని సినిమాల్లో కంటే కూడా ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. వాస్తవానికి ప్రభాస్ ని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయిందని కూడా చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. చాలా ఏళ్ళు తర్వాత ప్రభాస్ లోని ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బయటకు తీయబోతున్నాను అని మారుతి చెప్పుకొచ్చారు. మారుతి చెప్పినట్లు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయితే అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఆ ప్రొడక్షన్ హౌస్ కు ఈ సినిమా సక్సెస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారనుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×