The Raja Saab Story: ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం విభిన్నమైన కథలతో పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ ప్రేమ కథ చిత్రాలు, కుటుంబ కథ నేపథ్యం, ఫాదర్ సెంటిమెంట్ ఉన్న సినిమాలలో నటించారు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలలో కూడా నటించి నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ డైరెక్టర్ మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్ (The Raja Saab)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతోంది.
హర్రర్ కామెడీ థ్రిల్లర్…
ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ డైరెక్టర్ మారుతితో సినిమా చేస్తానని చెప్పడంతో ప్రభాస్ కోసం మారుతి ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ (Horror comedy thriller) గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక తాజాగా ఈ సినిమాలో కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
తాతయ్య ఆస్తికోసం…
ఇక ఈ సినిమాను డైరెక్టర్ మారుతి ఎంతో విభిన్నంగా డిజైన్ చేశారని చెప్పాలి. ఈ సినిమాలో తాత, నాన్నమ్మల సెంటిమెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో ప్రభాస్ కు తాత పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt)నటించిన విషయం తెలిసిందే.
ఇలా తన తాతయ్య సంపాదించిన ఆస్తి మొత్తం ఇతరులకు చెందకుండా తన దగ్గరే ఉండాలని కోరుకుంటాడు. అదే సమయంలోనే తన తాతయ్య ఆస్తి నాదే అంటూ మనవడు అక్కడికి రావడంతోనే అసలు చిక్కులు మొదలవుతాయని తెలుస్తుంది. ఇలా ఈ సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో తన నానమ్మ సహాయంతో ప్రభాస్ తన తాతయ్య ఆస్తిని దక్కించుకుంటారని సమాచారం.
పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో..
ఇలా ఆస్తిని దక్కించుకునే ప్రయత్నంలోనే హర్రర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ఉండే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేశారు. ఇలా ఒకవైపు సెంటిమెంట్ తో, మరోవైపు కామెడీ హర్రర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా బీభత్సంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి ఈ సినిమాకు ఇవే ప్లస్ పాయింట్ గా నిలిచాయి. అయితే ఇప్పటివరకు ఇలా సెంటిమెంట్ హర్రర్ కాన్సెప్ట్ తో ఏ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ విభిన్నమైన కాన్సెప్ట్ తో మారుతి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతున్నారని చెప్పాలి. ఏదిఏమైనా ఇప్పటివరకు చూడని ప్రభాస్ ను రాజా సాబ్ సినిమాలో చూడబోతున్నామని స్పష్టమవుతుంది. మరి ఈ సరికొత్త కాన్సెప్ట్ తో మారుతి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరుతారనే చెప్పాలి.
Also Read: ప్రభాస్ డైలాగులతో పిచ్చెక్కిస్తున్న పోలీసులు.. సినిమాకు ఇలా కలిసొచ్చిందా?