BigTV English

Ram Prasad : రాంప్రసాద్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన సుమ.. లైవ్ లోనే దండం పెట్టేశాడు..

Ram Prasad : రాంప్రసాద్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన సుమ.. లైవ్ లోనే దండం పెట్టేశాడు..

Ram Prasad : బుల్లితెర పై ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతుంటాయి. అందులో కొన్ని షోలు మంచి టీఆర్పీ రేటింగ్ కోసం కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా పండగలకు కొత్తగా ఉండేందుకు షోలు చేస్తారు. నిన్నటివరకు ఉగాది స్పెషల్ ఈవెంట్ లు కొత్తగా చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆ షోలు అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు అందరు శ్రీరామ నవమి ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శ్రీరామనవి కొత్త షోస్ రెడీ అయ్యాయి. సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది.. అ ప్రోమోలో సుమ రామ్ ప్రసాద్ ను ఆడుకుందని స్పష్టం అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి ప్రోమోను చూసేద్దాం..


శ్రీరామ నవమి స్పెషల్.. 

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ లో ప్రదీప్ మాచిరాజు, దీపికా జంటగా నటించిన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోషన్స్ కోసం ఆ షోకు వస్తారు. రాంప్రసాద్, ప్రదీప్, గెటప్ శీను కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ తో తెలుగు కాదు ఒక కొరియా సినిమా ప్లాన్ చేసాం అన్నాడు ప్రదీప్. అయితే ఆటో రాంప్రసాద్ డైరెక్టర్ నా కన్నా అందంగా ఉన్నాడే అని అంటాడు. వెంటనే ప్రదీప్ గుండ్రంగా తిరిగి ముఖం మీద కొంచెం మేకప్ ని చెరిపేసుకున్నాడు. దానికి రాంప్రసాద్ శాటిస్ఫై అయ్యాడు. నీకు గ్లామర్ తగ్గింది సరే మరి నాకు గ్లామర్ పెరగాలంటే ఎం చేయాలిఅని అడిగాడు.. దానికి ప్రదీప్ నువ్వు గ్లామర్ పెంచుకోవాలి అని అంటాడు. అక్కడివరకు సరదాగా సాగుతుంది..


సుమ పంచులు పీక్స్.. 

సుమ షో అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆమె కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఆమె షో కోసం అతుక్కుపోతారు. ఈ సుమ అడ్డాలో ఇప్పటికే ఎంతో మంది గెస్టులుగా వచ్చారు. ముఖ్యంగా అనుదీప్ వచ్చిన షో బాగా హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రదీప్ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. రాంప్రసాద్ ను ఆటో పంచులతో సుమ ఆడుకుంటుంది. ప్రతి రౌండ్ లో రాంప్రసాద్ కు చుక్కలు చూపిస్తుంది సుమ.. రివర్స్ పంచులతో అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. చివరి రౌండ్ లో క్రికెట్ గురించి ఆమె చెప్పినవి ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. సుమ తెలివికి ఆటో రాంప్రసాద్ లైవ్ లోనే దండేసి దండం పెట్టేస్తాడు. దాంతో ప్రోమో కట్ అవుతుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఎపిసోడ్ లో ఎంత రచ్చ రచ్చగా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ఆ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రదీప్ మాచిరాజు నటించిన లేటెస్ట్ చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు వరుసగా బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలలో కనిపిస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఆ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×