BigTV English

Pradeep: పవన్ కళ్యాణ్ టైటిల్ తో ప్రదీప్ ఎంట్రీ.. సక్సెస్ అయ్యేనా..?

Pradeep: పవన్ కళ్యాణ్ టైటిల్ తో ప్రదీప్ ఎంట్రీ.. సక్సెస్ అయ్యేనా..?

Pradeep.. బుల్లితెరపై మేల్ యాంకర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న యాంకర్ ప్రదీప్ (Pradeep) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన వాక్చాతుర్యంతో, కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ, మెప్పిస్తూ ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అంతే కాదు అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా కూడా నటిస్తూ వస్తున్న ప్రదీప్.. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన హీరోగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు.


పవన్ కళ్యాణ్ టైటిల్ తో ప్రదీప్ రెండవ సినిమా..

ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. నిజానికీ వరుస సినిమాలు చేస్తారని ఫ్యాన్స్ భావించినా.. దాదాపు నాలుగేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ప్రదీప్. ఈమధ్య కాలంలో టీవీ షో లకి కూడా దూరం అయ్యారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్, పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే టైటిల్ తో తన రెండవ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రదీప్ చేస్తున్న రెండో సినిమాకి కూడా టైటిల్ గా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే టైటిల్ ని పెట్టి ఒక చిన్న గ్లింప్ ని కూడా విడుదల చేశారు.


సినిమా టైటిల్ తోనే బజ్ క్రియేట్..

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా టైటిల్ పేరు కూడా ఇదే కావడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా టైటిల్ కి మంచి స్పందన వస్తేనే సినిమా కూడా పాజిటివ్ టాక్ అందుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ప్రదీప్ మాచిరాజు మాత్రం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సినిమాకు సంబంధించి చిన్న గ్లింప్ ను షేర్ చేస్తూ తన రెండవ సినిమా త్వరలోనే రాబోతోందని అధికారిక ప్రకటన చేశారు.

హీరోయిన్ గా బుల్లితెర యాంకర్..

ఇందులో మరో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పిల్లి (Deepika pilli)హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే జబర్దస్త్ షో ద్వారా దర్శకుడిగా పరిచయమైన నితిన్ , భరత్ ల ద్వయం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.అంతేకాదు ప్రదీప్ తో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ను నితిన్, భరత్ లు రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పలు కామెడీ షోలతో పాటు ఎన్నో రియాల్టీ షోలను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చిన ఈ దర్శకులు, ఇప్పుడు సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి. మొత్తానికి అయితే మొదటి సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న ప్రదీప్, ఇప్పుడు రెండవ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by pradeep machiraju (@pradeep_machiraju)

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×