Pragya Jaiswal: టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె సినిమాల సంగతి పక్కన పెడితే రోజురోజుకీ గ్లామరస్ గా తయారవుతుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఈమధ్య సినిమాలు కన్నా ఎక్కువగా ఫ్రెండ్స్ తో జాలి ట్రిప్ లు వేస్తూ అక్కడ దిగిన ఫోటోలను నెట్టిండా షేర్ చేస్తుంది. అయితే ఈ మధ్య ప్రేమలో పడింది ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు. కానీ ఇటీవల ఆమె ఫోటోలలో ఒక వ్యక్తి మాత్రం కామన్ గా ఉన్నాడు. అతనితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను చూసి నెటిజన్లు అది నిజమేనని భావిస్తున్నారు. ఆ వ్యక్తికి, ప్రగ్యాకు నిజంగానే ఏదైన సంబంధం ఉందేమో వివరంగా తెలుసుకుందాం..
ప్రేమలో పడిన ప్రగ్యా..?
కంచె సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ కుర్ర బ్యూటీ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు సక్సెస్ టాక్ ని అందుకున్న కూడా అమ్మడుకు స్టార్ ఇమేజ్ అయితే రాలేదు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బాలయ్య సరసన జోడిగా ఎక్కువ సినిమాలు చేసింది. రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీ లో నటించింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది. అయితే ఈ మధ్య ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కు వెళ్తూ బిజీగా ఉంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలలో ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. నిజంగానే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా? త్వరలోనే పెళ్లి చేసుకుంటారా? అతనితో ఉన్న రిలేషన్ ఏంటి అన్నది తెలియలేదు. ఈ వార్తలపై ప్రగ్యా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..
Also Read :వెరీ చీప్.. అఖండ 2లో బాలయ్య పాత్ర కాపీనా ? దీని కంటే దరిద్రం ఇంకోటి లేదు భయ్యా..
సినిమాల విషయానికొస్తే..
తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది.. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కంచె’ సినిమా లో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కంచె సినిమా విడుదలైన వెంటనే ప్రగ్యా జైస్వాల్‌కి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో అందంతో పాటు నటనతో మెప్పించడంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆమెను స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఫిక్స్ చెయ్యడంతో పాటు ఆకాశానికి ఎత్తేశారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా లో నటిస్తుంది. అలాగే తమిళ సినిమాల్లో కూడా నటిస్తుందని సమాచారం. సోషల్ మీడియా లో ఈమె రెగ్యులర్‌గా షేర్ చేసే ఫోటోల కారణంగా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో ఈమె ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్ అవుతున్నాయి..