Premi Viswanath: ప్రేమీ విశ్వనాథ్ (Premi Vishwanath) ఈ పేరు కంటే ఎక్కువగా వంటలక్క అనే పేరు చెబితేనే అందరికీ గుర్తుకొస్తుంది. వంటలక్క అనే పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత ఫేమస్ అయిపోయింది ఈ సీరియల్ ఆర్టిస్ట్. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ‘కార్తీకదీపం’ సీరియల్లో ‘దీప’ అనే పాత్రలో నటించింది ప్రేమీ విశ్వనాథ్. ఈ సీరియల్లో వంటలక్కగా పాపులారిటీ సంపాదించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క అనే పేరు తెలియని వారు ఎవరు ఉండరు అనే విధంగా స్టార్డం సంపాదించింది. ముఖ్యంగా ఓ హీరోయిన్ కి ఎంతలా అయితే ఫాలోయింగ్ ఉంటుందో.. అంత ఫాలోయింగ్ సంపాదించింది ప్రేమీ విశ్వనాథ్.
కార్తీకదీపం సీరియల్ తో భారీ పాపులారిటీ..
ఆమె కన్నడ ఇండస్ట్రీ ద్వారా తెలుగులో ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ (Karthika Deepam Serial) లో అవకాశం అందుకుంది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క అనే పాత్రల్లో నిరుపమ్ పరిటాల (Nirupam Paritala), ప్రేమీ విశ్వనాథ్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు. ఇక కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్ర పోషించిన ప్రేమీ విశ్వనాథ్ ఆత్మాభిమానం గల పాత్ర పోషించి, ఆడది అంటే ఇలా ఉండాలిరా అని అనుకునేలా చేసింది.
అయితే అలాంటి ప్రేమీ విశ్వనాథ్,నిరుపమ్ పరిటాల నటించిన కార్తీకదీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడ్డ సమయంలో చాలామంది అభిమానులు నిరాశ పడ్డారు. ఈ సీరియల్ ఇంకాస్త పొడగిస్తే బాగుండు అని కలల కన్నారు.. ఇక సీరియల్ ప్రేక్షకుల కోసమే కార్తీకదీపం 2 (Karthika Deepam-2) ‘నవ వసంతం’ పేరిట మళ్లీ డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు తెరమీదకి వచ్చాయి. అలా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల చేస్తున్న కార్తీకదీపం 2 సీరియల్ ని మళ్లీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సీరియల్ వచ్చిందంటే చాలు మిగతా సీరియల్స్ టీఆర్పి రేటింగ్స్ అన్ని కిందకు పడిపోతాయి.
ALSO READ: Gaddar Award: గద్దర్ అవార్డు మొమెంటో చూశారా.. దీని వెనుక అంత అర్థం దాగి ఉందా?
వంటలక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా?
అలా ప్రస్తుతం అన్ని సీరియల్స్ లోకెల్లా టాప్ టీఆర్పీ రేటింగ్ తో కార్తీకదీపం 2 దూసుకుపోతుంది. అయితే అలాంటి కార్తీకదీపం సీరియల్ లో నటించిన ప్రేమీ విశ్వనాధ్ కి సంబంధించి తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఆ వీడియోలో ప్రేమీ విశ్వనాథ్ ని చూసిన నెటిజన్స్ అందరూ వంటలక్క(Vantalakka)లో ఈ టాలెంట్ కూడా ఉందా అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. ప్రేమీ విశ్వనాథ్ తన కొడుకుతో కలిసి డ్యాన్స్ చేస్తుంది.. ఇక ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది డాన్స్ చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్ ని చూసి మురిసిపోతూ వంటలక్క టాలెంట్ మామూలుగా లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే అటు నటిగా ఇటు డాన్సర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటుంది వంటలకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==