Akhanda 2 Teaser Reaction : నందమూరి బాలయ్య నటిస్తున్న సినిమాలపై మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 చేస్తున్నాడు. గతంలో వచ్చిన అక్కడ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా నిన్న ఈ చిత్రం నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.. ఆ టీజర్ లో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే గ్రాఫిక్స్ పై నెట్టింట ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడేమో న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీలోని బాలయ్య గెటప్ ఓ స్టార్ సినిమాలోని గెటప్ లాగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమేంత ఉందో తెలుసుకుందాం..
‘అఖండ 2’ బాలయ్య గెటప్ కాపీనా..?
నేడు బాలయ్య పుట్టినరోజు సందర్బంగా అఖండ 2 మూవీ నుంచి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.. ఎప్పుడు ఇప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈ చిత్ర టీజర్ ని నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన సినిమా కన్నా ఈ సినిమా భారీ యాక్షన్స్ సన్నివేశాలతో రాబోతుందని టీజర్ ని చూస్తే అర్థమవుతుంది. టీజర్ లో బాలయ్య యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఈ టీజర్ పై నిన్నటి నుంచి మీమ్స్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడేమో ఈ మూవీలో బాలయ్య గెటప్ కాఫీ కొట్టారంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ మూవీలో అల్లు అర్జున్ గురువు పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ పాత్రలాగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ పిక్ ను బాలయ్య పిక్ ను యాడ్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు.. మరి దీని పై అఖండ 2 టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. డైరెక్టర్ ఆయనే..?
అఖండ 2 మూవీ…
అఖండకు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదొక వార్త నెట్టింట ప్రచారం చేస్తుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమా విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇకపోతే నార్త్ ఆడియన్స్ ని ఆకర్షించేందుకు పెహల్గామ్ ఉగ్ర దాడి ఘటన ని బేస్ చేసుకొని ఈ సన్నివేశాన్ని అల్లినట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది.. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Badrinath Lo Prakash Raj Ni Copy Kottadam Malli Cheap Anipiledaa 😭😭😭 pic.twitter.com/dVuAignXmZ
— ɢɪʀᴇᴇꜱʜ🧢 (@Gireesh_RCF1) June 9, 2025