Prakash Raj..ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్(Prakash Raj).. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పించారు. ముఖ్యంగా ఏదైనా పాత్ర పోషించారు అంటే.. అందులో పరకాయ ప్రవేశం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అంతలా అద్భుతంగా నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రకాష్ రాజ్. ఇక ఈ నటుడితో సినిమాలు చేయాలంటే ఏ దర్శక నిర్మాతలైనా సరే ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా టాలీవుడ్ లో దాదాపు చాలామంది హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది. అలాంటి ప్రకాష్ రాజ్ ను టాలీవుడ్లో ఏకంగా ఆరుసార్లు బ్యాన్ చేశారంటే.. ఎవరైనా నమ్మ గలరా.. ? ఇది అక్షర సత్యం.. అయితే ఈ విషయం తెలిసి అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గొప్ప నటుడిని ఆరుసార్లు తెలుగు ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారా..? అసలేం జరిగింది..? బ్యాన్ చేసే అంత పెద్ద తప్పు ఆయన ఏం చేశారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తి..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా పేరు దక్కించుకున్న ప్రకాష్ రాజ్.. ఈ ఏడాదితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. విలనిజంతో ఆడియన్స్ ని మెప్పించిన ఈయన తన పాత్రలతో ప్రేక్షకులలో చెరగని ముద్ర కూడా వేసుకున్నారు.బాలీవుడ్ తో పోల్చుకుంటే సౌత్ భాషా సినిమాలలో ఎక్కువగా కనిపించడంతో ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ నటుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎప్పుడూ కూడా వివాదాలలో ఇరుక్కుంటూనే ఉంటారు. అలా ఆయన చుట్టూ ఉన్న వివాదాలలో ఒకటి.. ఆయన షూటింగ్లకు ఆలస్యంగా వస్తారనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి.
టాలీవుడ్ నుండి ఏకంగా ఆరుసార్లు బ్యాన్ చేయబడ్డ ప్రకాష్ రాజ్..
ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సినిమా షూటింగ్స్ కి లేటుగా రావడంతో పాటు ఇతర కారణాలవల్ల తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆయన ఏకంగా ఆరుసార్లు బహిష్కరించబడ్డారట. ఒక ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రకాష్ రాజు కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ తోనే పని చేస్తారని , ఒకవేళ షూటింగ్ ఆలస్యం అయ్యే విషయాలను కూడా ముందుగా చెబుతారని ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రకాష్ రాజ్ తన నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ..ఉదయం చాలా లేటుగా మేల్కొంటారట. అందుకే సినిమా షూటింగ్లకు వెళ్లడానికి కూడా కాస్త ఆలస్యం అవుతుందని సమాచారం. అంతేకాదు నిద్ర విషయంలో రాజీ పడడానికి ఇష్టపడరు కాబట్టే ఇలా సినిమా షూటింగ్లకు ఆలస్యంగా వెళ్లి బ్యాన్ కూడా చేయబడ్డారని సమాచారం. ఇకపోతే ప్రకాష్ రాజ్ ప్రత్యేకమైన పనితీరు, అలవాట్లు, ఆయనను సినిమా పరిశ్రమలోని తన సన్నిహితుల నుండి వేరు చేస్తాయని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఇంత గొప్ప నటుడు ఇలా షూటింగ్లకు ఆలస్యంగా రావడమే కాకుండా పలు కారణాలవల్ల విమర్శలు ఎదుర్కోవడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి.