BigTV English

M M Keeravani : 35 ఏళ్ల కల ఇప్పుడు తీరింది… ఇళయరాజాకు థాంక్యూ అంటున్న ఆస్కార్ విన్నర్

M M Keeravani : 35 ఏళ్ల కల ఇప్పుడు తీరింది… ఇళయరాజాకు థాంక్యూ అంటున్న ఆస్కార్ విన్నర్

M M Keeravani : ఆస్కార్‌ విజేత ఎం.ఎం..కీరవాణి (MM Keeravani) గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని.. తెలుగు వారిని గర్వపడేలా చేశారు. అయితే.. ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో, అంత మంచి గాయకుడు కూడా. అంతే కాదు… ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. చాలా సినిమాల్లో పాటలు రాశారు. దాదాపుగా అరవైకి పైగా పాటలు రాశారు. కానీ తొలిసారి ఆయన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) బాణీకి పాట రాశారు.


షష్టిపూర్తి కోసం కీరవాణి

రూపేశ్, ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా షష్టిపూర్తి (Shashtipoorthi) అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అర్చన కూడా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఫ్యామిలీ మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటను ఎం.ఎం..కీరవాణి రచించారు. సినిమాలో ఓ ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే పాటకి కీరవాణి సాహిత్యం అందిస్తే బాగుంటుందని ఆయనతో ఈ పాట రాయించారు.అనన్య భట్ ఆలపించిన ఈ పాటకు ఇళయరాజా బాణీ, కీరవాణి సాహిత్యం అందించడం స్పెషాల్టీగా నిలిచింది. ఈ సందర్భంగా కీరవాణి థ్యాంక్యూ చెబుతూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.


అరుదైన అవకాశం

నేను ఫస్ట్ మద్రాస్ వెళ్లింది ప్లే బ్యాక్ సింగర్ అవుదామని.. కాకపోతే అది ఎంత కష్టమో ఆ తర్వాత తెలిసింది. తర్వాత మెల్లి మెల్లిగా సంగీత దర్శకుడిగా స్థిరపడ్డాను. అయితే.. నేను ప్లే బ్యాక్ సింగ్ అవాలని కలలు కనే రోజుల్లో.. ముఖ్యంగా ఇళయారాజా సంగీత దర్శకత్వంలో పాడాలని ఉండేది. ఆ కోరిక ఇప్పుడు ఇండైరెక్ట్‌గా నెరవేరింది. షష్టిపూర్తి అనే సినిమాను తెలుగులో డబ్ చేయగా.. అందులో నేను పాడడం జరిగింది. ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌కి, ఆయన ట్యూన్‌కి లిరిక్స్ రాసే అవకాశం నాకు లభించింది. షష్టిపూర్తి ద్వారా కలిగిన ఈ అవకాశాన్ని నాకు దక్కిన అరుదైన అవకాశాల్లో ఒకటిగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌గాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని చెప్పుకొచ్చారు. 35 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరిగిందని అన్నారు.

SSMB29 లాంటి సినిమా రాలేదు

ఇక.. ప్రస్తుతం కీరవాణి సంగీతం అందిస్తున్న సినిమాలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా గురించి కీరవాణి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇది అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలకు కీరవాణినే సంగీతం అందిస్తు స్తున్నారు. ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎంబీ 29కి సంగీతం అందిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వడం లేదు.  షూటింగ్ మాత్రం శరవేగంగా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కోసం స్పెషల్‌గా ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు.  మరి కీరవాణి ఈసారి తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×