PR 04: ..తమిళ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఎంతలా మెస్మరైజ్ చేస్తాడు అంటే.. నిజంగా మన పక్కింటి అబ్బాయేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. అంతలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆ పాత్రలలో జీవించేస్తున్నారు కూడా.. అందుకే ఇప్పటివరకు 3 సినిమాలు చేసినా.. ఆ 3 సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా. త్వరలో కృతి శెట్టి (Krithi Shetty) తో LIK అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈలోపే హీరోగా మరో ప్రాజెక్టుని ప్రకటించేశారు ప్రదీప్ రంగనాథన్.
ప్రదీప్ ప్రకటించిన ఈ కొత్త ప్రాజెక్టులో ‘ప్రేమలు’ మూవీతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన మమిత బైజు (Mamita Baiju)హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం. ఇకపోతే తెలుగు నిర్మాతలు అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్, మలయాళం హీరోయిన్ మమిత బైజు కాంబోలో సినిమా రాబోతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ తో ఇప్పుడు తెలుగు నిర్మాతలు సినిమా
చేయడానికి ఆయన వెంటపడుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో బై లింగ్వల్ సినిమాగా రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాను కీర్తి స్వరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇకపోతే ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో, హీరోయిన్, నిర్మాతలు కలవడం.. పైగా యూత్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో , హీరోయిన్ కాంబో సెట్ చేయడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఏది ఏమైనా భారీ క్రేజ్ ఉన్న ఈ ముగ్గురు కలిస్తే.. ఈ సినిమా మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేస్తున్నాడు అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో మూవీ అంటే కచ్చితంగా సూపర్ బ్లాక్ బాస్టర్ అని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రదీప్ రంగనాథన్ నాలుగవ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇక ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే.. 2019లో కోమాలి సినిమాతో దర్శకుడుగా సినీ రంగంలోకి అడుగు పెట్టి, 2022లో లవ్ టుడే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. లవ్ యాపా అనే చిత్రానికి కథ అందించిన ఈయన మళ్లీ డ్రాగన్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు మరో మూవీ అనౌన్స్మెంట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగిపోయి ఇకపోతే ఈయన గీతా రచయితగా కూడా పనిచేశారు.. 2019లో వచ్చిన కోమాలి సినిమాలో రెండు పాటలకు గీతా రచయితగా పనిచేసిన ఈయన.. లవ్ టు డే సినిమాలో ఏకంగా ఐదు పాటలకు లిరిక్స్ అందించారు