BigTV English

Prakash Raj: పవన్ ను వదిలేలా లేడే.. మళ్లీ ఎందుకయ్యా కదిలిస్తావ్

Prakash Raj: పవన్ ను వదిలేలా లేడే.. మళ్లీ ఎందుకయ్యా కదిలిస్తావ్

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్.. ఇప్పుడప్పుడే పవన్ కళ్యాణ్ ను వదిలేలా కనిపించడం లేదు.  ఆ తిరుపతి లడ్డూ వివాదం దగ్గరనుంచి మొదలైన ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర.. ఇంకా కొనసాగుతూనే ఉంది.  సనాతన ధర్మం గురించి  పవన్  మాట్లాడిన ప్రతిసారి.. ఆయనను విమర్శించడం మొదలుపెట్టాడు. ఇక ప్రకాష్ రాజ్  ట్వీట్స్ పై అభిమానులు కూడా ఫైర్ అవుతూ వస్తున్నారు. మత విద్వేషాలను   రెచ్చగొట్టకుండా సామరస్యంగా  ఈ సమస్యను పరిష్కరించమని ప్రకాష్ రాజ్..    ఒక ట్వీట్ పెట్టడంతో ఈ రగడ మొదలయ్యింది.


ఇక దానికి కౌంటర్ గా పవన్.. సనాతన ధర్మం గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడేవారు సపోర్ట్ గా మాట్లాడాలని, లేకపోతే సైలెంట్ గా ఉండాలని ఫైర్ అయ్యారు. ఇక దీంతో హర్ట్ అయిన ప్రకాష్ రాజ్.. తాను చెప్పింది అర్ధం కాలేదేమో అని మళ్లీ తాను పెట్టిన ట్వీట్ ను చదవమని  కోరుతూ వీడియో పెట్టాడు. ఇలా పవన్ ప్రతి మాటకు తనదైన రీతిలో కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు. ఇక తిరుపతి లడ్డూ వివాదంలో మొన్న.. సుప్రీం కోర్టు వేసిన ప్రశ్నలతో కూటమి సైలెంట్  అయ్యింది.

ఇక దానిపై కూడా ప్రకాష్ రాజ్ సెటైర్ వేశాడు. ” కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలుప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి”  అంటూ చెప్పుకొచ్చాడు. దీని తరువాత  గత రాత్రి పవన్ కళ్యాణ్  సభలో మాట్లాడుతూ.. ” నా ప్రాణం పోయేవరకు సనాతన ధర్మం కోసమే పోరాడతా నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేశారు అలాంటి వారికి చెబుతున్నా.. నేను సనాతనీ హిందువును. కానీ నేను ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిజంని గౌరవిస్తా. నా సనాతన ధర్మాన్ని అంతం చేస్తానంటున్న సెక్యులరిస్టులను మరోసారి హెచ్చరిస్తున్నా.. నా ప్రాణం పోయేవరకు సనాతన ధర్మం కోసమే పోరాడతా.. ” అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్  వేశాడు.


” స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం. జ‌స్ట్ ఆస్కింగ్‌.. ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం  ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్స్ ఇప్పుడప్పుడే  ప్రకాష్ రాజ్.. పవన్ ను వదిలేలా కనిపించడం లేదే.. సైలెంట్ గా ఉన్న పవన్ ను మళ్లీ ఎందుకయ్యా కదిలిస్తావ్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి వీరిద్దరి మాటల యుద్ధం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×