BigTV English

Prakash Raj : ఈ అవతారం ఏంటి? పవన్ కళ్యాణ్‌‌ను వదలని ప్రకాష్ రాజ్.. వాళ్ల నుంచి ఫుల్ సపోర్ట్

Prakash Raj : ఈ అవతారం ఏంటి? పవన్ కళ్యాణ్‌‌ను వదలని ప్రకాష్ రాజ్.. వాళ్ల నుంచి ఫుల్ సపోర్ట్

Prakash Raj: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఎన్నో చిత్రాలలో నటించి అంతకుమించి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన కర్ణాటక సమీపంలోని రెండు గ్రామాలను దత్తత తీసుకొని, ఆ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మంచి మనసు చాటుకుంటున్నారు. అంతేకాదు సమాజంలో జరిగే అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుపతిలో కల్తీ లడ్డూ వివాదం ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కౌంటర్..

ముఖ్యంగా లడ్డూలో గొడ్డు మాంసం కలిపారు అంటూ ల్యాబ్ రిపోర్ట్ లో కూడా తేలింది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.. ముఖ్యంగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరొకవైపు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డు కల్తీ అయిన విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప జాతీయస్థాయిలో ప్రచారం చేస్తూ మత కల్లోలాలు సృష్టించొద్దు అంటూ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ .. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ను కార్నర్ చేస్తూ.. ఎవరు మత కల్లోలాలు సృష్టిస్తున్నారో బాగా తెలుసు
డిప్యూటీ సీఎం గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పవన్ కి అంతకుమించి తెలుసు. దయచేసి ఎవరి హద్దుల్లో వారు ఉంటే చాలా మంచిది అంటూ మంచు విష్ణు కామెంట్లు చేశారు.


పవన్ కళ్యాణ్ కు మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్..

అయితే ఇప్పుడు మళ్లీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు మరొకసారి వైరల్ అవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టడంతో దీనిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ఈ విధంగా ట్వీట్ వేశారు. ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో..” గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం..? జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అసలు గొడవేంటి..?

ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ జరిగినప్పుడు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఆ సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీ.. ప్రకాష్ రాజ్ కు భారీగా సపోర్ట్ చేశారు. ఆ సమయంలో మంచు ఫ్యామిలీ ప్రకాష్ రాజు తో పాటు పవన్ కళ్యాణ్ పై కూడా కామెంట్లు చేసింది .కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండడంతో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు విష్ణు. అయితే గతంలో తనకు సపోర్టుగా నిలిచిన పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఎందుకు ఇలా వరుసగా ట్వీట్లు చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ సెటైర్లు చూసి తమిళ తంబీలు పండగ చేసుకుంటున్నారు. కార్తీ వ్యాఖ్యలను పవన్ సీరియస్‌గా తీసుకున్న రోజు నుంచి తమిళ సోషల్ మీడియా ఆయన్ని ట్రోల్ చేస్తోంది. వారంతా ఇప్పుడు ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×