BigTV English

Rajamouli – Pushpa 2 : పుష్ప సెట్స్‌లో జక్కన్న… క్యామియో పై క్లారిటీ..?

Rajamouli – Pushpa 2 : పుష్ప సెట్స్‌లో జక్కన్న… క్యామియో పై క్లారిటీ..?

Rajamouli – Pushpa 2 : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు..?
దీనికి ఎవరి నుంచి అయినా వచ్చే ఫస్ట్ పేరు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ టాప్ డైరెక్టర్‌కు తెలుగులో ఇష్టమైన డైరెక్టర్లు ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేస్‌లో ఉండే డైరెక్టర్ సుకుమార్. చాలా సందర్భాల్లో సుక్కు డైరెక్షన్ గురించి జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇద్దరు డైరెక్టర్లు ఓ ప్లేస్‌లో కలిశారట. ఎక్కడ కలిశారు.. ఎందుకు కలిశారు..? అనేది ఇక్కడ చూద్ధాం…


సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప 2 మూవీ తెరకెక్కిస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ ను పుష్ప ది రైజ్ అనే పేరుతో 2021 డిసెంబర్‌లో రిలీజ్ చేశారు. దీనికి సీక్వెల్‌‌ని పుష్ప ది రూల్ అనే టైటిల్‌తో ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఈ సీక్వెల్ చేయడానికి మూడేళ్ల టైం తీసుకున్నారు సుక్కు. సుకుమార్ నార్మల్‌గా సినిమా చేస్తేనే ఓ రెంజ్‌లో ఉంటుంది. అలాంటిది మూడేళ్ల టైం తీసుకుని సినిమా చేస్తే ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అని బన్నీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎక్స్ పెక్టెషన్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు.

ఇదింత పక్కన పెడితే, పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అయితే, ఈ షూటింగ్ స్పాట్‌కు డైరెక్టర్ రాజమౌళి వచ్చాడట. ఇద్దరు డైరెక్టర్లు సుక్కు, జక్కన్న చాలా సేపు మాట్లాడుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ త్వరలోనే విడుదల చేయబోతున్నారని సమాచారం. అయితే, ఈ ఇద్దరు డైరెక్టర్లు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు..? ఎందుకు కలిశారు అనే క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఇక్కడ అప్పుడే గాసిప్స్ కూడా మొదలయ్యాయి. పుష్ప 2 మూవీలో జక్కన్న ఓ క్యామియో చేస్తున్నాడని కొందరు అంటే, మరి కొందరు అల్లు అర్జున్ కోసం జక్కన్న వచ్చి ఉంటారని అంటున్నారు.


నిజానికి మొన్నటి వరకు అల్లు అర్జున్ పై షూట్ జరిగిందట. జక్కన్న షూటింగ్ స్పాట్ కి వెళ్లిన టైంలో అక్కడ అల్లు అర్జున్ లేడట. అంటే… జక్కన్న – సుకుమార్ ఓ ప్లాన్ ప్రకారం కలిశారని తెలుస్తుంది. అయితే ఎందుకు అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ అందరూ అనుకునేట్టు పుష్ప2 మూవీలో డైరెక్టర్ రాజమౌళి క్యామియో చేస్తే ఇప్పటికే హై రేంజ్‌లో ఎక్స్ పెక్టెషన్స్ ఎక్కడికి వెళ్తాయో…

కాగా, రాజమౌళి ప్రస్తుతం SSMB29 మూవీపై వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ మూవీని గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం హీరో మహేష్ బాబు తన లుక్ ను మొత్తం ఛేంజ్ చేసుకుంటున్నాడు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహేష్ బాబుని కలిశాడు. ఈ టైంలో మహేష్ బాబు లాంగ్ హెయిర్‌, గడ్డంతో కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×