Prapancha Yatrikudu :ప్రపంచ యాత్రికుడిగా పేరు సొంతం చేసుకున్న నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana Anvesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న చాలామందిని బయటకు లాగి.. వారి గురించి ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తూ ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి రహస్యాలను కూడా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని స్టార్ నటీనటులను కూడా బయటకు తీసిన ఈయన.. ఇప్పుడు 60 మంది బిగ్ బాస్ (Bigg Boss) టీం కలిసి మరో సరికొత్త స్కాం మొదలు పెట్టారని , బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు కాబట్టి క్లినిక్ అయితే ఎవరూ పట్టించుకోరని , హాస్పిటల్స్ పేరిట మళ్లీ మోసం చేయడం మొదలుపెట్టారు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
హెచ్.కే హాస్పిటల్స్ మోసం బయటపెట్టిన అన్వేష్..
తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో విడుదల చేసిన నా అన్వేషణ అన్వేష్.. హెచ్. కె. పర్మనెంట్ మేకప్ క్లీనిక్ (HK Hospitals) వెనక ఉన్న అసలు రహస్యాలు బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ..” 60 మంది దండుపాళ్యం బ్యాచ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బయటకు వెళ్తే ఏం చేయాలి ? ఎలా చేయాలి? అని ముందే ఆలోచించి, ఇప్పుడు హెచ్.కే పెర్మనెంట్ మేకప్ సొల్యూషన్ పేరిట హాస్పిటల్స్ ప్రారంభించారు. వైజాగ్, హైదరాబాద్ తో పాటు విజయవాడ , బెంగళూరు వంటి ప్రదేశాలలో కూడా వీటిని ప్రారంభిస్తున్నారు. సిరి హనుమంత్ (Siri Hanumanth) మొదలుపెట్టిన ఈ హెచ్ కే పర్మినెంట్ సొల్యూషన్స్ మేకప్ క్లినిక్ వెనుక పెద్ద స్కామ్ వుంది. బెట్టింగ్ యాప్స్ అనేవి ఎప్పుడైనా ఉండొచ్చు ఎప్పుడైనా పోవచ్చు వీటివల్ల పైగా కేసులు కూడా.. కానీ ఇలా హాస్పిటల్స్ పెడితే ఎవరికీ అనుమానం రాదు. లోపల కిడ్నీలు, ఊపిరితిత్తులు అమ్ముకున్న ఎవరూ పట్టించుకోరు. అందుకే ఇలా హాస్పిటల్స్ పేరిట లోపల దందా నడిపిస్తున్నారు” అంటూ సంచలన కామెంట్ చేశారు.
డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?
హెచ్ కె పెర్మనెంట్ క్లినిక్ కోసం మొత్తం 60 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఓపెనింగ్ కి వచ్చారు. అసలు ఎక్కడైనా హాస్పిటల్స్ ఓపెనింగ్ సమయంలో చీర్ గర్ల్స్ చేసి ఎంకరేజ్ చేస్తారా.. డాన్స్ చేస్తారా..? పైగా ఈ హెచ్ కె హాస్పిటల్ ని ప్రమోట్ చేసిన వాళ్లకు రూ.2లక్షలు. అది ఎవరు చేసినా ఓకే.. ముఖ్యంగా కర్రి బిడ్డగా పేరు సొంతం చేసుకున్న రైతుబిడ్డ ఈ హెచ్ కె పెర్మనెంట్ సొల్యూషన్స్ లో తెల్లగా మారి చూపించాడు. ఇక పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా.. సన్నగా ఉండే వాళ్ళు లావుగా మారుస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే జరగాలి . కానీ ఇక్కడ ఒక అమ్మాయి థాయిలాండ్లో బ్యూటిషన్ కోర్స్ నేర్చుకొని వచ్చి ఇప్పుడు డాక్టర్ గా గత మూడు సంవత్సరాలుగా చలామణి అవుతోంది. ఎక్కడ డాక్టరేట్ చేసావు అని అడిగితే స్పందించడం లేదు. వీళ్లంతా కూడా హాస్పిటల్ పేరిట మోసానికి పాల్పడుతున్నారు. దయచేసి ఇలాంటి స్కామ్ లో మీరు ఇరుక్కోవద్దు” అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు అన్వేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Squid Game 3: ‘స్క్విడ్ గేమ్ 3’ టీజర్ రిలీజ్.. అనుక్షణం ఉత్కంఠ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!