Kiara advani: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani) ప్రెగ్నెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గర్భం దాల్చిన తర్వాత ఆమె మీడియా ముందుకు రాలేదు. కానీ తొలిసారి న్యూయార్క్ లో జరుగుతున్న మెట్ గాలా ఈవెంట్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తొలిసారి బేబీ బంప్ తో దర్శనమిచ్చి, తన లుక్ తో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ వేదికపై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు కూడా. ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్ లో తలుక్కుమని మెరిసిన కియారా అద్వానీ బేబీ బంప్ తో కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమెను చూసిన నెటిజన్స్ కియారా ఎంత క్యూట్ గా ఉందో కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బేబీ బంప్ ను ఆస్వాదిస్తున్న ఈమె ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.
రక్షణగా సిద్ధార్థ్ మల్హోత్ర..
ఇకపోతే కియారా ప్రెగ్నెన్సీ లుక్ బయటకు రాకుండా సిద్ధార్థ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మెట్ గాలా కోసం ఆమె బేబీ బంప్ తో ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టి ఆమె పైనే పడింది. ఈ మెట్ గాలా లుక్ కోసం గౌరవ గుప్తా అందమైన డ్రెస్ ను రూపొందించారు. దీనికి ‘బ్రేవ్ హార్ట్స్’ అనే పేరు కూడా పెట్టారు. ఈ లుక్కులో కియారా మరింత అందంగా మెరిసిపోయింది. బ్లాక్, గోల్డెన్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. అంతేకాదు బ్లాక్ డ్రెస్ కి వచ్చిన రెండు గోల్డెన్ హార్ట్స్ తల్లి , బేబీని ఉద్దేశించి డిజైన్ చేసినట్లు గౌరవ్ స్పష్టం చేశారు. అటు ఈ ఫోటోలను షేర్ చేస్తూ కియారా.. “Mama’s first Monday in May” అంటూ ప్రేమతో కూడిన హ్యాపీ ఎమేజిని కూడా షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈమెకు లవ్ సింబల్స్ తో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తూ అటు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. మొత్తానికి అయితే మెట్ గాలా వేదికపై తొలిసారి అడుగులు వేసిన ఈమె అందులోను బేబీ బంప్ తో కనిపించడం చాలా ప్రత్యేకమనే చెప్పాలి.
కియారా, సిద్ధార్థ్ ప్రేమ , పెళ్లి:
2020లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) తో డేటింగ్ మొదలుపెట్టినట్లు పుకార్లు వచ్చినప్పటికీ, ఈ విషయంపై కియారా బహిరంగంగా స్పందించలేదు. కానీ 2023 ఫిబ్రవరి 7న జై సల్మేర్, రాజస్థాన్లో సాంప్రదాయ హిందూ వివాహ వేడుకల్లో వీరి వివాహం జరిగింది. అంతేకాదు వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. వివాహం తర్వాత కూడా పలు చిత్రాలలో కియారా నటించింది. అలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో రామ్ చరణ్ సరసన మళ్లీ జతకట్టింది. కానీ ఈ సినిమా పెద్దగా వీరికి సక్సెస్ అందివ్వలేదు. ఇక తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించింది. ఇక అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈమె బేబీ బంప్ ను ఆస్వాదిస్తోంది.