BigTV English

Ruturaj Gaikwad Century In IPL 2024: ఐపీఎల్ లో సెంచరీ చేసిన 8వ కెప్టెన్.. రుతురాజ్

Ruturaj Gaikwad Century In IPL 2024: ఐపీఎల్ లో సెంచరీ చేసిన 8వ కెప్టెన్.. రుతురాజ్
CSK vs LSG IPL 2024- Ruturaj Gaikwad Hits First IPL Century: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్  సూపర్ సెంచరీతో ఒక రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ లో సెంచరీలు సాధించిన కెప్టెన్లలో 8వ వాడిగా నిలిచాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ 56 బంతుల్లో సెంచరీ చేశాడు. అంతేకాదు 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఇందులో 3 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి.

వీటితో పాటు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సెంచరీ చేసిన తొలి కెప్టెన్ గా నిలిచాడు. మరి ఇంతకాలం ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు కదా తను చెయ్యలేదా? అనే సందేహాలు అందరిలో వస్తాయి. నిజంగా ధోనీ వ్యక్తిగత రికార్డుల కోసం చూడలేదనడానికి ఇదొక్కటే ఉదాహరణ.


ఐపీఎల్ ట్రోఫీలను 5 సార్లు అందించిన కెప్టెన్ గా ఘనత సాధించిన ధోనీ ఖాతాలో ఒక్క సెంచరీ లేకపోవడం విచిత్రమే. ఎందుకంటే తనెప్పుడూ ఓపెనర్ గా రాడు. తన ప్లేస్ 5 లేదా 6వ ప్లేస్ లో వస్తాడు. లేదంటే లాస్ట్ ఓవర్స్ ఉంటే అప్పుడు వస్తాడు. జట్టు గెలవాలనే చూస్తాడు తప్ప, చాలామంది క్రికెటర్లలా వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రం ఆడడనేది మరోసారి రుజువైంది.

Also Read: చెన్నై కొంప ముంచిన ఆఖరి ఓవర్ .. గెలవదనుకున్న మ్యాచ్ గెలిచిన లక్నో


నిజానికి ధోనీ హయ్యస్ట్ స్కోరు 84 నాటౌట్. అంతే  ఆ తర్వాత మళ్లీ 70 నాటౌట్, తర్వాత 67 నాటౌట్, 66 నాటౌట్, 58 నాటౌట్ ఇలాగే ఉన్నాయి. అదీ  ధోనీ అంటే అని అందరూ గొప్పగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఆ రికార్డ్ రుతురాజ్ కి దక్కింది. తను ఓపెనర్ గా రావడం వల్ల 20 ఓవర్లలో సెంచరీ సాధ్యమైంది.

ఐపీఎల్ క్రికెట్ లో… కెప్టెన్లలో సెంచరీ సాధించిన వారిలో కేఎల్ రాహుల్ (132 *), డేవిడ్ వార్నర్ (126), వీరేంద్ర సెహ్వాగ్ (119), సంజూశాంసన్ (రాజస్థాన్ రాయల్స్ ), విరాట్ కొహ్లీ (113, 109, 108*, 100*, 100 ), ఆడమ్ గిల్ క్రిస్ట్ 106, సచిన్ టెండుల్కర్ (100*), రుతురాజ్ గైక్వాడ్ (108*) ఉన్నారు.

Tags

Related News

Sachin Tendulkar: ఖరీదైన ఫ్లాట్ కొన్న సచిన్… కొడుకు అర్జున్ వేరు కాపురం పెట్టనున్నాడా !

Sarfraz Khan : గే తో టీమిండియా యంగ్ క్రికెటర్ అ**క్రమ సంబంధం?

World Cup 2027 : వన్డే వరల్డ్ కప్ 2027 వేదికలు ఖరారు…మొత్తం ఎన్ని మ్యాచ్ లు అంటే

Watch Video : చేతులు లేకుండానే క్రికెట్ ఆడుతున్నాడు.. సిక్స్ లు, ఫోర్లు కూడా బాదేస్తున్నాడు… వీడు మగాడ్రా బుజ్జి

Dream 11 Second Innings : డ్రీమ్ 11 ఇండియాలో బ్యాన్ అయిందా.. షాక్ లో ఐపీఎల్ అభిమానులు.. కేంద్రం క్లారిటీ ఇదే

Watch Video: పాపం ట్రాఫిక్ పోలీస్.. క్రికెట్ ఆడలేక.. బ్యాట్ అడుక్కుని మరీ… వీడియో వైరల్

Big Stories

×