BigTV English

Prashanth Varma: ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో నాని.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే..!

Prashanth Varma: ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో నాని.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే..!

Prashanth Varma..ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ‘హనుమాన్’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చి పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్నారు. ఇక అందులో భాగంగానే ఒక యూనివర్స్ క్రియేట్ చేసి ఎంతోమంది స్టార్ హీరోలను తన యూనివర్స్ లో భాగం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. యాంకర్ సుమా(Suma).. ప్రశాంత్ వర్మను ఎందుకు నానితో సినిమా చేయడం లేదు? అంటూ ప్రశ్నించింది దానికి ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇదంతా ఎప్పుడు? ఎక్కడ జరిగిందో ? ఒకసారి చూద్దాం.


ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో నానికి అవకాశం ఉందా..?

ఒకవైపు యాక్షన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాని(Nani ) మరొకవైపు నిర్మాతగా కూడా ఒక మూవీని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అదే ‘కోర్ట్ స్టేట్ Vs ఏ నోబడీ’.. ప్రముఖ కమెడియన్ కం హీరో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో.. రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. మార్చి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ట్రైలర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ జగదీష్ (Ram Jagadeesh) ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి నూతన దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో హర్ష, శివాజీ, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు ప్రశాంత్ వర్మ. ఈ ఈవెంట్ లో భాగంగానే ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో ఎన్నో కథలు ఉన్నాయి.. మరి నానితో ఒక సినిమా తీయలేదు..ఎందుకు? అంటూ ప్రశ్నించింది.


ఆశ్చర్యపరుస్తున్న ప్రశాంత్ వర్మ రియాక్షన్..

ఇక దీనికి ప్రశాంత్ వర్మ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కాస్త తడబడుతుంటే.. అంతలోనే సుమా కలగజేసుకొని ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందా అంటే..? లేదు అని అడ్డంగా తలూపేసారు ప్రశాంత్ వర్మ. ఇక దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో నాని నటించడం లేదు అని తెలుస్తోంది. ఇక అనంతరం ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “ఈ సినిమా ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఈ సినిమా అంతే ఎంగేజింగ్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇక ‘వాల్ పోస్టర్’ సినిమా ద్వారా నాని నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నాతో పాటు ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ని నాని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముఖ్యంగా నాలాంటి ఎంతోమంది టాలెంట్ ను ఎంకరేజ్ చేయడమే కాకుండా ఆ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. నాని ఒక వ్యక్తి గానే కాకుండా ప్రొడ్యూసర్ గా, టెక్నీషియన్ గా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి.. ఇండస్ట్రీ ఏమిచ్చింది మనం ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని నేను నాని నుంచీ నేర్చుకున్నాను. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం నానినే అంటూ నాని పై ప్రశంసలు కురిపించారు. కానీ ఇక తన డైరెక్షన్లో మళ్లీ నానికి అవకాశం ఇస్తారా అనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీగా చెప్పలేదు. మొత్తానికైతే ఈ విషయంపై నాని అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

 

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×