BigTV English
Advertisement

Gaami OTT Release Date: ఓటీటీలోకి ‘గామి’.. థియేటర్లలోనూ పోటీ.. ఇక్కడ కూడా పోటీనా..!

Gaami OTT Release Date: ఓటీటీలోకి ‘గామి’.. థియేటర్లలోనూ పోటీ.. ఇక్కడ కూడా పోటీనా..!

Gaami OTT release date


Vishwak Sen’s Gaami OTT Release Date Fixed: ఓ సమస్య కారణంగా హీరో ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అయితే ఆ ముప్పు నుంచి బయటపడేందుకు ఆ హీరో హిమాలయాలకు బయల్దేరుతాడు. అక్కడ త్రివేణి పర్వతం మీద 36ఏళ్లకు ఒకసారి మాలిపత్రి అనే ఓ మొక్క పుడుతుంది. అయితే అది అలాంటి ఇలాంటి సాధారణ మొక్క కాదు. అది ఒక ఔషద మొక్క.

ఆ మొక్క ఈ హీరోకి అవసరం పడుతుంది. దానికోసం హిమాలయాలకు బయల్దేరుతాడు హీరో. అలాంటి సమయంలో అతడికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదురౌతాయి. ఇప్పటికీ ఏంటా సినిమా అని ఆలోచిస్తున్నారా?.. అదేనండి విశ్వక్ సేన్ నటించిన గామి. ఇటీవల థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కదా.


ఇందులో విశ్వక్ సేన్ తన పాత్రతో సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాడు. ఎప్పుడు చేయని పాత్రలో కనిపించి సినిమాకి కొత్త దనాన్ని అందించాడు. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. దాదాపు రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.22 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అబ్బురపరచింది.

Also Read: ఇండస్ట్రీలో వరుస మరణాలు.. ఇప్పటికీ ముగ్గురు

కాగా ఈ మూవీతో పాటు మరో సినిమా గోపీచంద్ నటించిన ‘భీమా’ కూడా అదేరోజు రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మంచి అంచనాలతో వచ్చినా.. గోపీచంద్‌కు పెద్ద హిట్ ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ మూవీలు కూడా అదే రోజు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇక థియేటర్లలో అదరగొట్టేసిన గామి సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భారీ విజువల్ ఎఫెక్ట్స్, విశ్వక్ సేన్ యాక్టింగ్ చూడాలని ఎంతో మంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారికి తాజాగా ఓ వార్త ఫుల్ ఖుష్ చేసింది.

ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా థియేటర్ రన్ అనంతరం కొద్ది రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట.

Also Read: 47 ఏళ్ల వయస్సులో కూడా కుర్రకారుకు కునుకు పట్టనిచ్చేట్టు లేదుగా..

ఈ సందర్భంగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ముందుగా దీనిని ఏప్రిల్ 5న స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు మరో తేదీ వినిపిస్తోంది. ఏప్రిల్ 12న జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా గామి మూవీ స్ట్రీమింగ్ రోజే మరో సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఆ సినిమా మరేదో కాదు.. గామి థియేటర్ రిలీజ్ రోజే విడుదలైన ప్రేమలు మూవీ. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో పోటీ పడ్డాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి.

Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×